తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) మరోసారి తన టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఆయన హీరోగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) కథానాయికగా కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార వేడుకలో నవీన్ తన పెళ్లి నుంచి కెరీర్ స్ట్రగుల్స్ వరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
Read also: Spirit: ఫస్ట్ పోస్టర్: ప్రభాస్ మాస్ ఎనర్జీతో సోషల్ మీడియా బ్లాస్ట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే నవీన్ (Naveen Polishetty) పెళ్లి అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. “ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజే.. కరెక్ట్‌గా 12 గంటల తర్వాత నేను కూడా వివాహం చేసుకుంటా” అంటూ నవ్వులు పూయించాడు. మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుతూ, “సంక్రాంతి అంటే భోగి మంటలు, పతంగులు ఎలా కామన్‌గా ఉంటాయో.. మీనాక్షి సినిమా కూడా కామన్‌గా మారిపోయింది. ఈ సినిమాకు మీనాక్షి సరిగ్గా సరిపోయింది.
చారులత పాత్రకు మీనాక్షి సరిపోయింది
చారులత పాత్రకు ఆమె పర్ఫెక్ట్” అంటూ ప్రశంసించారు.తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న నవీన్ (Naveen Polishetty), అవకాశాల కోసం ముంబైలో కష్టపడ్డ రోజులను ప్రస్తావించారు. రూమ్ రెంట్ కోసం పెళ్లి సంగీత్‌లకు హోస్ట్‌గా పనిచేయడం నుంచి థియేటర్‌లో నాటకాలు చేయడం వరకూ ఎన్నో పనులు చేశానన్నారు. ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని, వారి మధ్య ఎలాంటి పోటీ లేదని చెప్పారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవిని తనకు స్ఫూర్తిగా పేర్కొంటూ, “మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా స్టార్‌గా ఎదగవచ్చని చూపించిన వ్యక్తి చిరంజీవిగారు. నాలాంటి వాళ్లకు దారి చూపింది ఆయనే” అని తెలిపారు. ఇంజినీరింగ్ చదివి ఇంగ్లాండ్ వెళ్లిన నవీన్, నటన మీద ఉన్న ప్రేమతో తిరిగి భారత్ వచ్చి కష్టకాలాన్ని ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: