📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Narivetta Movie: నరివెట్ట (సోనీ లివ్) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: July 11, 2025 • 5:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళ సినీ పరిశ్రమలో టోవినో థామస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన విలక్షణమైన నటనతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో మెరిసిన ఈ యువహీరో తాజా చిత్రం ‘నరివెట్ట’ (Narivetta) తో మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఈ సినిమా మే 23న థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా జూలై 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ సోనీలివ్లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ నేపథ్యం

2003వ సంవత్సరంలో నడిచే కథ ఇది. వర్గీస్ (టోవినోథామస్) కేరళలోని ఒక ప్రాంతంలో తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. టైలరింగ్ పనిచేస్తూ తల్లినే ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఏదైనా ఉద్యోగం చూసుకోమని ఆమె కొడుకుని కోరుతూ ఉంటుంది. అదే విలేజ్ కి చెందిన నాన్సీ (ప్రియంవద కృష్ణన్)తో అతను ప్రేమలో పడతాడు. అయితే ఎలాంటి జాబ్ లేని అతనికి తన కూతురునిచ్చి పెళ్లి చేయడం ఆమె తండ్రికి ఇష్టం ఉండదు.ఈ నేపథ్యలోనే పోలీస్ డిపార్టుమెంటులో వర్గీస్ (Varghese) జాబ్ సంపాదిస్తాడు. పై అధికారుల ధోరణి నచ్చకపోయినా, అయిష్టంగానే రోజులు నెట్టుకొస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి బషీర్ (సూరజ్ వెంజరమూడు) పరిచయమవుతాడు. వయనాడ్ లో జరుగుతున్న ఆదివాసీల పోరాటాన్ని అణచివేసే డ్యూటీ పడుతుంది. దాంతో బషీర్ టీమ్ తో కలిసి వర్గీస్ కూడా వెళతాడు. మొదటిసారిగా అతను ఆదివాసీలు భూమి కోసం చేస్తున్న పోరాటాన్ని దగ్గరగా చూస్తాడు.

Narivetta Movie: నరివెట్ట (సోనీలివ్) మూవీ రివ్యూ

అటవీ ప్రాంతంలో

ఆదివాసీల వెనుక మావోయిస్టులు చేరి ఈ పోరాటం చేయిస్తున్నారనే అనుమానం సీనియర్ పోలీస్ ఆఫీసర్ రఘురామ్ (చేరన్) కి ఉంటుంది. మావోయిస్టుల జాడ కనిపెట్టడానికి వెళ్లినవారిలో బషీర్ మిస్సవుతాడు. బషీర్ ను వెతుకుతూ వెళ్లిన వర్గీస్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆదివాసీలను కట్టడి చేయడానికి వచ్చిన అతను, వాళ్లకి అండగా ఎందుకు నిలబడతాడు? అనేది మిగతా కథ. ఈ కథలో 80 శాతం వరకూ అటవీ ప్రాంతంలో జరుగుతుంది. పోలీసులకు, ఆదివాసీ (Adivasi) లకు మధ్య జరిగే పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా ఈ కథ తెరకెక్కింది. తెరపై చాలామంది కనిపించినా ప్రధానమైన పాత్రలు అరడజను వరకు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది. సహజత్వానికి చాలా దగ్గరగా ఈ పాత్రలన్నీ కదులుతూ ఉంటాయి.

నరివెట్ట (Narivetta) సినిమాకి నిజమైన కథ ఏమిటి?

నరివెట్ట సినిమా కథ 2003లో జరిగిన ముతంగా గిరిజన ఉద్యమం (Muthanga Tribal Protest) ఆధారంగా రూపొందించబడింది. ఈ ఉద్యమం కేరళ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో భూమి హక్కులు, ప్రభుత్వ నియంత్రణ, అణచివేతపై జరుగిన తీవ్రమైన సంఘర్షణగా చరిత్రలో నిలిచింది.

నరివెట్ట సినిమా చూడదగినదేనా?

అవును, నరివెట్ట సినిమా తప్పకుండా ఒకసారి చూడదగ్గ సినిమా. ఈ చిత్రం ముఖ్యంగా సామాజికంగా ప్రభావవంతమైన కథా నేపథ్యంలో రూపొందిన మలయాళ సినిమా ప్రేమికులకు, మూలవాసుల హక్కులు, అణచివేత, పోలీసు దాడులు, న్యాయ పోరాటం వంటి అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Oh Bhama Ayyo Rama: ‘ఓ భామ అయ్యో రామ’ మూవీ రివ్యూ

Breaking News latest news Malayalam to Telugu OTT release Narivetta movie OTT Narivetta Telugu dubbed SonyLIV new Malayalam thriller Telugu News Tovino Thomas movie 2024

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.