📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Nani – మిరాయ్‌ సినిమాపై నాని ట్వీట్

Author Icon By Anusha
Updated: September 14, 2025 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన ‘మిరాయ్’ చిత్రం (Mirai movie) విడుదలైన మొదటి రోజే ప్రేక్షకుల మన్ననలు సంపాదించి, బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రధాన కారణం అద్భుతమైన కథ, స్క్రీన్‌ప్లే, తేజ యొక్క చక్కటి నటన, అలాగే మంచు మనోజ్ విలనిజం. ఈ రెండు ప్రధాన అంగాలు కలిసినందుతోపాటు, వీఎఫ్ఎక్స్ వర్క్‌ (VFX work) లు చిత్రాన్ని మరింత ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లాయి. సుమారు 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం, ప్రేక్షకులకు అందించిన విజువల్ క్వాలిటీతో ఆసక్తి పెంచింది.

ప్రేక్షకుల మధ్య ప్రథమ ప్రదర్శన రోజు మాత్రమే టాక్ క్రియేట్ చేయడం సులభం కాదు. కానీ ‘మిరాయ్’ తొలిరోజే రూ.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం, తేజ కెరీర్లోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్ రికార్డును సృష్టించింది. ఈ రికార్డు, తేజ అభిమానులందరినీ, సినీ పరిశ్రమ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. ‘హనుమాన్’ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎదిగిన తేజ, ‘మిరాయ్’ ద్వారా మరో పెద్ద అడుగు ముందుకు వేసాడు.తాజాగా ఈ చిత్రంపై హీరో నాని (Nani) ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. ‘తేజ అభినందనలురా.. నీ నమ్మకం, సహనం, కష్టం ఫలించింది.

నీకు, నీ టీమ్‌కి చాలా సంతోషంగా ఉంది

మంచు మనోజ్ (Manchu Manoj) బాబాయ్ నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది. చాలా ఆలస్యమైంది కానీ నీకు రావాల్సిన విజయమే. ప్రియమైన కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) నువ్వు సాధించింది, దాన్ని సాధించిన విధానం చూసి గర్వంగా ఉంది. నీకు, నీ టీమ్‌కి చాలా సంతోషంగా ఉంది. మ్యూజిక్, యాక్షన్ కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. విశ్వప్రసాద్ గారికి, మొత్తం టీమ్‌కి గుర్తుండిపోయే విజయం దక్కినందుకు అభినందనలు’ అంటూ శనివారం అర్దరాత్రి 12 గంటల 22 నిమిషాలకు నాని ట్వీట్ చేశాడు.

నాని ఈ చిత్రాన్ని అభినందిస్తూ ట్వీట్ చేయడం బాగానే ఉంది కానీ మరీ అర్థరాత్రి వేళ ట్వీట్ (Tweet) చేయడమే కాస్త వింతగా అనిపిస్తోంది. ‘మిరాయ్’ చిత్రం కోసం కార్తీక్ ఘట్టమనేని ముందుగా నానినే సంప్రదించాడన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రాజెక్ట్ పట్టాలెక్కే సమయానికి రెమ్యునరేషన్ విషయంలో తేడాలు రావడంతో నాని తప్పుకున్నాడు. దీంతో తేజతో సినిమా తీసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు కార్తీక్.

నాని తప్పకుండా బాధపడుతూనే ఉంటాడని

చిన్న హీరో, పైగా టిక్కెట్ల రేట్లు కూడా పెంచకుండానే తొలిరోజే ఏకంగా రూ.27.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ‘మిరాయ్’ రిజల్ట్ చూశాక దాన్ని వదులుకున్నందుకు నాని తప్పకుండా బాధపడుతూనే ఉంటాడని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఈ అర్ధరాత్రి ట్వీట్ చూస్తుంటే ఆ బాధతోనే తనకు నిద్ర పట్టడం లేదేమో అనిపిస్తోందంటున్నారు. మొత్తానికి నాని ఓ బ్లాక్‌బస్టర్ వదులుకోవడంపై ఆయన ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ssmb29-ssmb29-shooting-started-at-ramoji-film-city/cinema/547022/

acting performance amazing story blockbuster talk Breaking News first day collections latest news Manchu Manoj Mirai Movie strong screenplay Teja Sajja Telugu cinema Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.