Nani: పుట్టినరోజు సందర్భంగా తన 32వ చిత్రం ప్రకటించిన నాని

Read Time:  1 min
Nani: పుట్టినరోజు సందర్భంగా తన 32వ చిత్రం ప్రకటించిన నాని
FONT SIZE
GET APP
Nani: పుట్టినరోజు సందర్భంగా తన 32వ చిత్రం ప్రకటించిన నాని
Nani: Nani announces his 32nd film on his birthday

Nani: నేచురల్ స్టార్ నాని తన పుట్టినరోజు వేళ అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అప్‌డేట్‌తో జోరు మీద ఉన్న నాని, తాజాగా తన 32వ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ‘ఓజీ’ దర్శకుడు సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు.

Read also: Meenakshi Chaudhary: ప్రతిసారీ అదో కొత్త అనుభూతి అంటూ మీనాక్షి భావోద్వేగం!

గతంలోనే ప్రకటించిన ఈ ప్రాజెక్ట్, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, తాజాగా అధికారికంగా మొదలవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో నాని ఒకవైపు చెఫ్‌గా కనిపిస్తూనే, మరోవైపు గ్యాంగ్‌స్ట‌ర్‌గా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారని సమాచారం.

నాని సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి లేదా పూజా హెగ్డే పేర్లను చిత్ర బృందం పరిశీలిస్తోంది. ఇక మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించడం ఖాయం. ఈ ఏడాది డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2026 క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.