డ్రాగన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి కాయదు లోహర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమెకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. తాజాగా ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌లో నటించేందుకు అధికారికంగా ఒప్పుకుంది. నాని (Nani) హీరోగా నటిస్తున్న కొత్త తెలుగు సినిమా ‘ది ప్యారడైజ్’లో కాయదు లోహర్ కీలక పాత్రలో కనిపించనుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొంటుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
Read Also: Champion Movie: చాంపియన్ ట్రెండ్.. ప్రభాస్ పేరు వైరల్
నానికి చాలా కీలకమైన ప్రాజెక్ట్
అయితే వాటిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోగా, ఇప్పుడు స్వయంగా కాయదు ఆ వార్తలను కన్ఫార్మ్ చేయడంతో సందేహాలకు తెరపడింది.‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ విడుదలైనప్పుడు థియేటర్లలో వచ్చిన రియాక్షన్‌ను చూపిస్తూ కాయదు లోహర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అదే వీడియో ద్వారా ఈ సినిమాలో తాను భాగమని అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే ఆమె షూటింగ్ కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఈ సినిమా నాని (Nani)కి చాలా కీలకమైన ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుండగా, భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: