ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) బుధవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ఆయన రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ మనుషులు శాశ్వతం కాదని, మనం చేసే పనులు శాశ్వతమని అన్నారు.
Read Also: Sonu Sood: మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్
రూ.లక్ష విరాళం
తన తండ్రి నాగేశ్వరరావు చదువుకోకపోయినా, చదువుపై ఉన్న ఇష్టంతో వేల మందికి బంగారు భవిష్యత్తును అందించారని, 1959లో నాగేశ్వరరావు కళాశాలకు రూ.లక్ష విరాళం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే వెనిగండల్ల రాము,కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: