ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామానికి చెందిన జనసైనికుడు కట్టా రామకృష్ణ కుమారుడు, 3 ఏళ్ల శ్రీహర్ష గుండె సంబంధిత అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్న నాగబాబు వెంటనే స్పందించారు. తన వంతు బాధ్యతగా చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 1,00,000 (లక్ష రూపాయల) ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
Read also: IPS Sunil Kumar Nayak: ఏపీ పోలీసుల తీరుపై పట్నా హైకోర్టు ఫైర్
10 శాతం మాత్రమే రక్తం సరఫరా
ఈ క్రమంలోనే హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీహర్ష గత 26 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇక శ్రీహర్ష పరిస్థితి విని తీవ్ర విచారం వ్యక్తం చేసిన నాగబాబు.. వారి కుటుంబాన్ని ఆదుకుని.. ధైర్యం చెప్పారు. అదే సమయంలో ఆ శ్రీహర్ష ప్రాణాలు కాపాడేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా నాగబాబు పిలుపునిచ్చారు.శ్రీహర్షకు గుండె నుంచి కేవలం 10 శాతం మాత్రమే రక్తం సరఫరా అవుతున్నట్లు డాక్టర్లు చెప్పడంతో అతడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
ఇక గత 26 రోజులుగా అతడికి ఇస్తున్న చికిత్స కోసం ఇప్పటికే ఆ కుటుంబం రూ. 13 లక్షలు ఖర్చు చేసింది. చికిత్స చేసేందుకు ఇంకో రూ. 10 లక్షలు కావాలని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం చిన్నారి పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గానే ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన నాగబాబు.. చిన్నారి ప్రాణాలు రక్షించేందుకు తన వంతుగా రూ.లక్ష ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: