హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ (Shivaji) చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా పరిశ్రమలో చర్చలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటుడు నాగబాబు ఘట్టంగా స్పందించారు. (Nagababu) మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం, వారిపై ‘మోరల్ పోలీసింగ్’ చేయడం సరికాదని ఆయన కచ్చితంగా ఖండించారు. నాగబాబు మాట్లాడుతూ, ఈ విషయంపై తన అభిప్రాయాన్ని ఒక సాధారణ పౌరుడిగా వ్యక్తపరిచారని చెప్పారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు చెందినదని నాగబాబు స్పష్టపరిచారు. వారి ఎంపికలను తీర్చిదిద్దే హక్కు ఎవరికి ఉండదని, మహిళలపై జరిగే హింస, నేరాలకు కారణం వారి దుస్తులు కాకుండా పురుషుల క్రూరమైన మనస్తత్వం మాత్రమే అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాలు కూడా మహిళల దుస్తుల వల్ల నేరాలు జరుగుతాయని నిరూపించలేదు అని నాగబాబు గుర్తు చేశారు. మహిళల భద్రత కాపాడుకోవడం సమాజం, ప్రభుత్వం ప్రధాన బాధ్యత అని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది.
Read Also: Shivaji: మహిళా కమిషన్ కార్యాలయానికి నటుడు శివాజ
శివాజీ వ్యాఖ్యలను ఘట్టంగా ఖండించారు
నాగబాబు మహిళలకు ఒక సూచన చేశారు. మీకు నచ్చిన దుస్తులు ధరిస్తూ, మీ వ్యక్తిగత అభిరుచిని చూపించండి. (Nagababu) అయితే, సమాజంలో మహిళల భద్రతపై పూర్తి నమ్మకం ఏర్పడే వరకు, మీ వ్యక్తిగత భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైతే స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోవడం మర్చిపోకండి అని ఆయన పేర్కొన్నారు. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సీరియస్ వివాదానికి దారి తీసినట్లు సినీ పరిశ్రమలో పలువురు, సింగర్ చిన్మయి, నటి అనసూయ భరద్వాజ్ లాంటి ప్రముఖులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నాగబాబు స్పందనతో ఈ వివాదం మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛల అంశాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: