Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘తండేల్’ వంటి భారీ చిత్రం తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది.
Read Also: Naga chaitanya : వేదికపై కుర్చీ ఒరిగి పడిపోయిన నాగ చైతన్య, అభిమానుల్లో కలకలం
నాగచైతన్య కెరీర్‌లో బెస్ట్ ఫిలిం
గ్లింప్స్ విడుదల సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ఈ సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘వృషకర్మ’ తన కెరీర్‌లో 100% బెస్ట్ ఫిలిం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. చాలా కాలంగా ఒక లార్జ్ స్కేల్ స్పెక్టికల్ చేయాలన్న తన కోరిక ఈ సినిమాతో నెరవేరుతోందని, ప్రతి సన్నివేశం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇస్తుందని చైతూ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: