Latest news: Naga Chaitanya: నాగచైతన్య-శోభిత ధూళిపాళ: మొదటి వివాహ వార్షికోత్సవం

Read Time:  1 min
Naga Chaitanya
Naga Chaitanya
FONT SIZE
GET APP

అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళలు(Naga Chaitanya) తమ వైవాహిక జీవితంలో మొదటి ఏడాదిని పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో శోభిత తమ పెళ్లి నాటి అరుదైన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో జంట మధ్య ఉన్న అనురాగం, కుటుంబ సంతోషం, సంప్రదాయ తెలుగు వివాహ వేడుకల అందమైన క్షణాలను చూపించారు.

Read also: ఏపీలో రోడ్డుపై అంతిమ సంస్కారాలు: హైకోర్టు సీరియస్

Naga Chaitanya
Naga Chaitanya-Sobhitha Dhulipala: First wedding anniversary

శోభిత ఎమోషనల్ పోస్టు

శోభిత(Shobhita) తన ఇన్‌స్టాగ్రామ్‌లో(Naga Chaitanya) వీడియోతో పాటు భావోద్వేగభరితమైన క్యాప్షన్ కూడా పెట్టారు. “గాలి ఎప్పుడూ ఇంటి వైపుకే వీస్తుంది. నా భర్తతో కలిసి సూర్యుని చుట్టూ ఒక పూర్తి ప్రయాణాన్ని ముగించాను. అగ్నితో శుద్ధి అయినట్లుగా కొత్త అనుభూతి కలుగుతోంది. శ్రీమతిగా ఒక సంవత్సరం…” అంటూ తమ మొదటి ఏడాది ప్రయాణాన్ని వివరించారు. ఈ పోస్టును చూసిన అభిమానులు, నెటిజన్లు జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.