📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Naga Chaitanya: ‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

Author Icon By Saritha
Updated: March 10, 2026 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Naga Chaitanya: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2025 గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో ‘తండేల్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికైన అక్కినేని నాగచైతన్య తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ గౌరవం దక్కడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Read Also: Bellamkonda Sreenivas : అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

Naga Chaitanya: Gaddar Film Award for the film ‘Tandel’.. Chaitanya thanks the government

ప్రభుత్వానికి కృతజ్ఞతలు

“నాకు ఎంతో ప్రత్యేకమైన ‘తండేల్’ సినిమాకు ఉత్తమ నటుడి అవార్డు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇదే చిత్రం ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగానూ అవార్డు గెలుచుకోవడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ గౌరవం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని చైతన్య పేర్కొన్నారు. దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్‌తో పాటు కథానాయిక సాయి పల్లవి, సంగీత దర్శకుడు డీఎస్పీ సహా చిత్ర బృందానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అన్నారు.

ఇప్పటికే నాగచైతన్య తండ్రి, అగ్ర నటుడు నాగార్జున కూడా ఈ అవార్డులపై స్పందించిన విషయం తెలిసిందే. ‘తండేల్’ చిత్రంలో చైతన్య అద్భుతమైన నటనకు ఈ పురస్కారం సరైన గుర్తింపు అని కొనియాడారు. తన తండ్రి ఏఎన్నార్ పేరిట అవార్డును నెలకొల్పినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఏఎన్నార్ అవార్డు గెలుచుకున్న జయసుధకు, ఎన్టీఆర్ అవార్డు అందుకున్న చిరంజీవికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Awards Gaddar Awards 2025 Winners Nagachaitanya Best Actor Telangana State Film Awards thandel movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.