📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Kareena Kapoor: నా కొడుకు ఎప్పుడూ కోహ్లీ గురించే అడుగుతాడు: కరీనా కపూర్

Author Icon By Anusha
Updated: October 15, 2025 • 1:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) తాజాగా తన కొడుకు తైమూర్ (Taimur) గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కరీనా తెలిపిన వివరాల ప్రకారం, తైమూర్‌కి క్రికెట్ పట్ల, ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పట్ల అపారమైన అభిమానముందని చెప్పారు. తైమూర్ ఎప్పుడూ కోహ్లీ గురించే మాట్లాడుతుంటాడని, అతని ఫోన్ నంబర్ తన దగ్గర ఉందా అని తరచూ అడుగుతుంటాడని కరీనా కపూర్ వెల్లడించారు.

Read Also: Kuldeep Yadav: జట్టులో కీలక బౌలర్ కుల్దీప్‌: గిల్

తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న కరీనా కపూర్ (Kareena Kapoor) తన కుటుంబం, పిల్లలు, సినిమాల గురించి మాట్లాడుతుండగా, సోహా అలీ ఖాన్ ఆమెను తైమూర్ గురించి అడిగారు.తైమూర్‌కు నటనపై ఏ మాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేసింది. ‘యాక్టింగ్ క్లాస్‌లో జాయిన్ అవుతావా? అంటే తైమూర్ నో చెప్పేవాడు.

Kareena Kapoor

ఒకసారి ప్రయత్నించి చూడంటే.. లేదమ్మా.. నేను యాక్టింగ్‌ను ఆస్వాదించలేనని చెప్పేవాడు. అందుకే మేం కూడా వాడిని బలవంతం చేయడం లేదు.తైమూర్.. ఎప్పుడూ నటులు, సినిమా స్టార్లు, మ్యూజిక్ గురించి ఏమీ అడగలేదు. కానీ ప్రతీసారి విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి అడుగుతూ ఉంటాడు.

కోహ్లీతో పాటు రోహిత్ శర్మ

నేను విరాట్ కోహ్లీకి మెసేజ్ చేయవచ్చా..? అతను రిప్లే ఇస్తాడా? నీ దగ్గర కోహ్లీ నెంబర్ ఉందా? అని ప్రశ్నిస్తుంటాడు.కోహ్లీతో పాటు రోహిత్ శర్మ (Rohit Sharma) నీకు ఫ్రెండ్సెనా? వాళ్ల బ్యాట్‌ను నాకు గిఫ్ట్‌గా ఇవ్వమని మెసేజ్ చేస్తావా? లియోనల్ మెస్సీ (Lionel Messi) ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా? అని అడుగుతుండేవాడు.

వాళ్ల నెంబర్లు నా దగ్గర లేవని చెప్పేవాడిని. వానికి సినిమాలు, సినిమా యాక్టర్ల గురించి ఏ మాత్రం తెలియదు. ఎప్పుడూ స్పోర్ట్స్ స్టార్స్ (Sports stars) గురించే అడుగుతుంటాడు.’ అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News Kareena Kapoor latest news Rohit sharma Taimur Ali Khan Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.