📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

My Baby Movie: ఈ నెల 18న విడుదల అవుతున్న ‘మై బేబీ’ మూవీ

Author Icon By Anusha
Updated: July 13, 2025 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘DNA’ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ‘మై బేబి’ పేరుతో జూలై 18న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సురేష్ కొండేటి తన ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాన్ని (Sensor programme) పూర్తిచేసుకుంది.సురేష్ కొండేటి పేరు తెలుగు చిత్రసీమలో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. గతంలో ఆయన ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు. నిర్మాతగా ఇది ఆయన 16వ సినిమా కాగా, డిస్ట్రిబ్యూటర్‌గా 85కి పైగా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆయనకు ఈ సినిమా పై మంచి నమ్మకం ఉంది. ‘‘ఇది కూడా హిట్ మూవీగా నిలుస్తుందని’’ ధీమా వ్యక్తం చేశారు.

నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కించబడింది

ఈ సినిమాకు నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో అధర్వ మురళి, నిమిషా సజయన్ నటించారు. సినిమా శైలిగా క్రైమ్ థ్రిల్లర్ (Crime thriller) అయితే, దీని కథ 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కించబడింది.ఈ సినిమా కథ భావోద్వేగభరితంగా, అదే సమయంలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో నడవనుందని చిత్ర బృందం చెబుతోంది. కథనంలో ఉన్న డెప్త్‌ వల్ల ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని, భావోద్వేగాలతో పాటు థ్రిల్ ఎలిమెంట్స్‌ కూడా ఉండబోతున్నాయని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

సినిమాకు

సాయిచరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా టెక్నికల్ టీమ్ కూడా ఎంతో నిబద్ధతతో పని చేసినట్లు సమాచారం. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం కూడా సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలవనున్నాయని సమాచారం.తెలుగులో ‘మై బేబి’ (My Baby) పేరుతో విడుదల అవుతున్న ఈ సినిమా ఇప్పటికే తమిళంలో మంచి రెస్పాన్స్‌ అందుకుంది. అందుకే తెలుగు వెర్షన్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. క్రైమ్ థ్రిల్లర్‌, జానర్‌ను ఇష్టపడే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది ఈ సినిమా.

DNA తమిళ సినిమా ఏ జానర్‌కు చెందింది?

గ్రిప్పింగ్ తమిళ థ్రిల్లర్ సినిమా. ఇది భావోద్వేగాలు,సస్పెన్స్ తో కూడిన కథనాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించబడింది.

మై బేబీ సినిమా కథ ఎలాంటిదీ?

2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించిన భావోద్వేగభరిత క్రైమ్ థ్రిల్లర్. ఇందులో తండ్రి–కూతురి మధ్య బంధం, జరిగిన అనూహ్య సంఘటనలు హృదయాన్ని తాకేలా ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Anurag Kashyap: నెట్‌ఫ్లిక్స్ సీఈఓ పై అనురాగ్ కశ్యప్ ఘాటు విమర్శలు

Atharvaa Murali Telugu Debut Breaking News Crime Thriller Telugu Movies My Baby Telugu Movie Release Suresh Kondeti My Baby Tamil Movie DNA Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.