తమిళంలో ఇటీవల విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న చిత్రం DNA, తెలుగులో ‘మై బేబి’ పేరుతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ కొండేటి (Suresh Kondeti) తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూలై 18న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. గతంలో ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా వంటి హిట్ తమిళ డబ్బింగ్ చిత్రాలను అందించిన సురేష్ కొండేటి, ఇప్పుడు మరోసారి సరికొత్త భావోద్వేగ కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన నెల్సన్ వెంకట్, ఆసుపత్రులపై ఆధారిత మాఫియా నేపథ్యంలో ఒక భావోద్వేగ కథను తెరపై చూపించారు. ఈ సినిమాలో హీరోగా అథర్వ మురళి (Atharva Murali), (ఆనంద్), హీరోయిన్‌గా నిమిషా సజయన్ (దివ్య) నటించారు. ట్రైలర్‌ను చూస్తే, ఈ సినిమా ఒక థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామాగా ఉంటుందని స్పష్టమవుతుంది.
మానసిక సమస్యతో
కథ విషయానికి వస్తే, ఆనంద్ తన ప్రేమను కోల్పోయి మందులకు బానిసవుతాడు. ఇదే సమయంలో దివ్య అనే యువతి బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతోంది. వీరిద్దరూ అనుకోకుండా పెళ్లి చేసుకుంటారు. ఆనంద్ దివ్యను అర్థం చేసుకుని ప్రేమతో గడుపుతాడు. దివ్య గర్భవతి అవుతుంది. కొన్ని నెలల తరువాత బిడ్డ జన్మిస్తుంది. కానీ, ఆ బిడ్డను ఆసుపత్రి (Hospital) లో మార్చేశారనే అనుమానంతో దివ్య బాధపడుతుంది.తన మానసిక పరిస్థితి వల్ల ఎవ్వరూ ఆమె మాటలను నమ్మరు. కానీ ఆనంద్ తన భార్యపై నమ్మకం ఉంచి, అసలు నిజాన్ని వెతకడం ప్రారంభిస్తాడు. తన భార్యకి పుట్టిన బిడ్డను వెతకడం కోసం ఆయన ఆరాటపడతాడు. ఈ క్రమంలో పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మే పెద్ద నెట్‌వర్క్ ఒకటి ఉందని తెలుసుకుంటాడు. ఇది ఎంతటి ప్రమాదకరంగా ఉందో, ఎవరు దీనిని నడుపుతున్నారో తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్లలోనే చూడాలి.
DNA సినిమాకు దర్శకుడు ఎవరు?
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వ్యక్తి నెల్సన్ వెంకట్ (Nelson Venkatesan).
DNA మూవీలో ప్రధాన నటులు ఎవరు?
ఈ సినిమాలో అథర్వ మురళి హీరోగా, నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Anurag Kashyap: సెన్సార్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అనురాగ్ కశ్యప్..ఎందుకంటే?