📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Murali Mohan: లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు

Author Icon By Anusha
Updated: January 26, 2026 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Murali Mohan: Even though it came late, it came latest

2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ, మురళీ మోహన్‌ (Murali Mohan) కు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. “అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు నిన్న సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేశారు.

Read Also: Nadeem Khan: అత్యాచారం కేసు.. దురంధర్ నటుడి అరెస్టు?

పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు

‘మీకు ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడైనా వచ్చింది’ అని అంటుంటే.. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది అని వారికి చెప్పాను. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఏదైనా ఎదురు చూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువ. ఇంత మంచి అవార్డును ఇచ్చిన ప్రధాని మోదీకి, ఏపీ సీఎం చంద్రబాబుకి, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి, చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు. అవార్డు అందుకున్న తర్వాత వివరంగా ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలు చెబుతాను. థ్యాంక్యూ” అని, మురళీ మోహన్‌ (Murali Mohan) అన్నారు.

‘జగమే మాయ’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోగానే కాకుండా సహాయ నటుడు, విలన్ పాత్రల్లోనూ రాణిస్తూ తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.నిర్మాతగా ఆయన స్థాపించిన జయభేరి ఆర్ట్స్ బ్యానర్ టాలీవుడ్‌లో అనేక క్లాసిక్ చిత్రాలకు వేదికైంది.సామాజిక విలువలు, సందేశాత్మక అంశాలతో రూపొందిన సినిమాలను ప్రోత్సహించిన నిర్మాతగా మురళీ మోహన్ ప్రత్యేక స్థానం సంపాదించారు.

గతంలో టీడీపీ ఎంపీగా గెలిచిన మురళీ మోహన్

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఆయన సేవా దృక్పథం కొనసాగింది.రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన మురళీ మోహన్, తన నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు ఎందరికో మేలు చేశాయి.

మాగంటి మురళీ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం ఆయన మానవతా భావానికి నిదర్శనంగా నిలిచింది.రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినీ రంగంతో ఆయన అనుబంధం ఎప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘ కాలంగా పద్మ పురస్కారాల కోసం ఆయన పేరు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Murali Mohan Padma Shri Award Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.