Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లి వార్తలపై మృణాల్ క్లారిటీ

Read Time:  1 min
Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లి వార్తలపై మృణాల్ క్లారిటీ
FONT SIZE
GET APP

ఇటీవల సోషల్ మీడియాలో నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), నటుడు ధనుష్‌ల మధ్య ప్రేమాయణం సాగుతోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ పుకార్లపై మృణాల్ ఠాకూర్ తాజాగా స్పష్టత ఇచ్చారు. ధనుష్ తనకు అన్నయ్య లాంటి వారని, తమ మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆమె నటించిన ‘ధో దివానే సహార్ మెయిన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Read Also: Amaravati Film Hub: త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్

Mrunal's clarity on marriage news with Dhanush
Mrunal’s clarity on marriage news with Dhanush

ఒక్క‌ పుకారుతో తక్కువ చేసి చూడటం స‌రికాదు

నా వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ఏదో పెద్ద‌ ర‌హ‌స్యాన్ని దాస్తున్నాన‌ని, అందుకే మౌనంగా ఉంటున్నానంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. నా లైఫ్ గురించి ఎవ‌రికి క్లారిటీ ఇవ్వాల్సిన ప‌నిలేదు.నేను సాధించిన విజ‌యాలు, పేరు ప్ర‌ఖ్యాతులు, గుర్తింపు ఒక్క రోజులు వ‌చ్చిన‌వి కాదు. వాటి వెనుక ఎన్నో ఆడిషన్లు, మరెన్నో తిరస్కరణలు, నిద్రలేని రాత్రులు గ‌డిపాను. నా కష్టాన్ని అర్థంలేని ఒక్క‌ పుకారుతో తక్కువ చేసి చూడటం స‌రికాదు. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లో ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్‌. తెలుగులో అడివిశేష్ డెకాయిట్‌తో పాటు అల్లు అర్జున్‌, అట్లీ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.