📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

Mrs Deshpande: ‘మిస్సెస్ దేశ్ పాండే’ ( జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

Author Icon By Saritha
Updated: December 24, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్(Madhuri Dixit) ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ ‘మిస్సెస్ దేశ్‌పాండే’ (Mrs Deshpande). దీనితో డిజిటల్ స్పేస్‌లోకి ఆమె తిరిగి వస్తున్నారు. ఈ సిరీస్‌లో ఒకప్పటి అందాల కథానాయిక మాధురి దీక్షిత్, సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ సిరీస్ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 19వ తేదీ నుంచి ‘జియో హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు ఇతర భాషలలోను అందుబాటులో ఉంది. చాలా గ్యాప్ తరువాత మాధురీ దీక్షిత్ చేసిన ఈ సిరీస్, ఫ్రెంచ్ మినీ సిరీస్ ‘లా మాంటే’కి రీమేక్.

Read Also: Mysaa Movie: కళ్లలో కోపం.. చేతిలో గన్.. రష్మిక యాక్షన్ గ్లింప్స్

కథ

ముంబైలో వరుస హత్యలు జరుగుతుంటాయి. (Mrs Deshpande)హంతకుడు నైలాన్ రోప్ ను మెడకి బిగించి హత్యలు చేస్తుంటాడు. అలా హత్య చేసిన తరువాత ఆ బాడీని అద్దానికి ఎదురుగా కూర్చోబెడుతూ ఉంటాడు. అలాగే శవం కళ్లు తెరుచుకుని ఉండేలా చేస్తుంటాడు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయం, కమిషనర్ అరుణ్ ఖత్రి (ప్రియాన్షు ఛటర్జీ)కి అర్థం కాదు. దాంతో ఆయన ఈ కేసును పరిష్కరించడానికిగాను స్పెషల్ ఆఫీసర్ గా తేజస్ (సిద్ధార్థ్ చందేకర్) ను రంగంలోకి దింపుతాడు.

తన్వీ (దీక్షా జునేజా)తో కలిసి హ్యాపీగా గడుపుతున్న తేజస్, ఆల్రెడీ వేరే అండర్ కవర్ ఆపరేషన్ లో ఉంటే అతణ్ణి మధ్యలోనే పిలిపిస్తారు. గతంలో ఈ తరహా హత్యలు చేసిన ‘మిస్సెస్ దేశ్ పాండే’ (మాధురీ దీక్షిత్), ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉందని తేజస్ తో అరుణ్ చెబుతాడు. ప్రస్తుతం వరుస హత్యలకు పాల్పడుతున్న హంతకుడిని పట్టుకోవడానికి, దేశ్ పాండే సహాయం తీసుకుందామని అంటాడు. దేశ్ పాండే సాయం తీసుకుంటూనే ఆమె పారిపోకుండా చూసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు.

కథనం

25 ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్న దేశ్ పాండేను, హైదరాబాద్ సెంట్రల్ జైలు నుంచి ముంబైకి రప్పిస్తారు. గతంలో ఎనిమిది హత్యలు చేసిన దేశ్ పాండే, ఇప్పుడు తన మాదిరిగానే హత్యలు చేస్తున్నది ఎవరై ఉంటారా అనే విషయంపై పూర్తి ఫోకస్ పెడుతుంది. తేజస్ ఇన్వెస్టిగేషన్ లో హోష్ .. అలెక్స్ .. సుహాస్ అనే పేర్లు తెరపైకి వస్తాయి. ఆ ముగ్గురూ ఎవరు? దేశ్ పాండేకి వాళ్లతో గల సంబంధం ఏమిటి? దేశ్ పాండే ఎందుకు హంతకురాలిగా మారింది? ఆమెను అనుసరిస్తూ వరుస హత్యలు చేస్తున్నది ఎవరు? అనేది మిగతా కథ.

ఇది సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. ఒక హంతకుడిని పట్టుకోవడానికిగాను, ఆల్రెడీ శిక్షను అనుభవిస్తున్న ఒక హంతకురాలిని జైలు నుంచి బయటికి తీసుకురావడంతో ఈ కథపై ఆడియన్స్ కి ఆసక్తి పెరుగుతుంది. పాతికేళ్ల తరువాత ఆమె స్టైల్లో హత్యలు చేసుకుంటూ వెళుతున్నది ఎవరా అనే ఒక కుతూహలం అందరిలో పెరుగుతుంది. కొత్త హంతకుడు దొరుకుతాడా? పాత నేరస్థురాలు పారిపోతుందా? అనేది అందరిలో ఉత్కంఠను పెంచే మరో అంశం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Jio Hotstar Latest News in Telugu Madhuri Dixit Mrs Deshpande Series psychological thriller Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.