📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Mrithyunjay Movie: రాజమౌళి చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ టీజర్ లాంచ్

Author Icon By Aanusha
Updated: February 12, 2026 • 7:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Mrithyunjay Movie: Srivishnu’s ‘Mrithyunjay’ teaser launched by Rajamouli

యంగ్ హీరో శ్రీవిష్ణు కథల ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకత చూపిస్తుంటారు. వినూత్న కథలు, సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన శ్రీవిష్ణు తాజాగా నటించిన చిత్రం ‘మృత్యుంజయ్’ (Mrithyunjay Movie). ఈ సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించగా, ‘సామజవరగమన’ తర్వాత ఈ జంట మరోసారి తెరపై కనిపించనుండటం విశేషం. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. శ్రీహుసేన్‌ షా కిరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Read Also: Lavanya Tripathi: నా కుటుంబం జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను

చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం (Mrithyunjay Movie).. ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.‘మృత్యుంజయ్‌’ టీజర్ ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

చిత్ర యూనిట్ కి తన బెస్ట్ విషెస్ తెలిపారు.. ”మృత్యుంజయ్‌ టీజర్ ని రూపొందించిన విధానం చాలా నచ్చింది.. అతను సత్యాన్ని వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. విష్ణు, హుస్సేన్, సన్నీలకు శుభాకాంక్షలు. ఫిబ్రవరి 27 కోసం ఎదురు చూస్తున్నాను” అని రాజమౌళి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Mrutyunjay Movie Mrutyunjay Teaser Rajamouli's Impact on Telugu Cinema Reba Monica John Sri Vishnu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.