యాంకర్ సుమ కనకాల (suma kanakala) తనయుడు, యువ నటుడు రోషన్ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’ ట్రైలర్ విడుదలయ్యింది. సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ట్రైలర్ విడుదలతో సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉత్సాహం సృష్టించబడింది.
Read also: Samantha- Raj Nidimoru: పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన సమంత
Suma’s son Roshan Kanakala’s film ‘Mowgli 2025’ released
రోషన్ సరసన సాక్షి సాగర్ మదోల్కర్
జాతీయ అవార్డు గ్రహీత, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో, టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
చిత్రంలో రోషన్ సరసన సాక్షి సాగర్ మదోల్కర్ కథానాయికగా నటిస్తోంది. వైవా హర్ష కీలక పాత్రలో కనిపిస్తారు. సంగీతం ప్రసిద్ధ యువ సంగీత దర్శకుడు కాలా భైరవ సమకూరుస్తున్నారు. వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రోషన్ కనకాల మంచి విజయాన్ని సాధించగలడని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: