ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల నటించిన సినిమా ‘మోగ్లీ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరిస్తోంది. (Mowgli Movie) కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథ, అడవిలో పెరిగిన యువకుడు, మూగ అమ్మాయి ప్రేమ చుట్టూ తిరుగుతుంది. డిసెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 17 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం. ఇందులో బండి సరోజ్ కుమార్ విలన్ గా నటించారు. సాక్షి మడోల్కర్ కథానాయికగా, వైవా హర్ష, కృష్ణ భగవాన్ కీలక పాత్రల్లో నటించారు.
కాల భైరవ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు. భారీ స్థాయిలో కాకపోయినా, కంటెంట్ పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే లవ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారు ఇప్పుడు ‘మోగ్లీ’ను ఈటీవీ విన్‌లో వీక్షించవచ్చు. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా ఓటిటిలోకి రావడంతో మూవీ లవర్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది.
Read also: Dolby Screen: దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్.. ఎక్కడంటే?
కథేంటంటే
మోగ్లీ (రోషన్ కనకాల) ఓ అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అతను ఊరి పక్కనే ఉన్న అడవినే తన అమ్మగా భావిస్తూ జీవనం సాగిస్తుంటాడు. (Mowgli Movie) ఎస్సై కావాలనేది తన కోరిక. అందుకోసం కష్టపడుతూనే సినిమా షూటింగ్స్ కోసం వచ్చే వారికి సాయం చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. అలా ఓ సినిమాకు డూప్‌గా నటించాల్సి వస్తుంది. ఆ మూవీ టీంలో డ్యాన్సర్ జాస్మిన్ (సాక్షి మడోల్కర్)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే క్రిస్టోఫర్ నుంచి జాస్మిన్‌ను మోగ్లీ ఎలా కాపాడాడు? తన ప్రేమను గెలవడానికి మోగ్లీ ఏం చేశాడు? అతని ఎస్సై కల నెరవేరిందా? మోగ్లీ, జాస్మిన్ ఒక్కటయ్యారా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: