క్రిస్మస్ పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల (Movies) సందడి నెలకొంది. విభిన్న కథాంశాలతో వచ్చిన చిన్న సినిమాలు (Movies)ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యాయి. అయితే ఈ చిత్రాల తొలిరోజు వసూళ్ల వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. నిన్న విడుదలైన ఛాంపియన్, శంబాల, దండోరా, ఈషా సినిమాలు పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నాయి.
Read Also: Champion Movie: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘ఛాంపియన్’
ఛాంపియన్
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా, ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వచ్చిన పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’. ఫుట్‌బాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రోషన్ నటనకు మంచి మార్కులు పడటంతో, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రోషన్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌గా నిలిచింది.
శంబాల
చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ ‘శంబాల’తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. యుగంధర్ ముని దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. సైన్స్, దైవత్వం మధ్య సాగే ఈ చిత్రం మొదటి రోజు రూ. 3.3 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద నిలకడగా కొనసాగుతోంది.హారర్ చిత్రం ఈషాకు రూ.1.6 కోట్లు వచ్చినట్లు టాక్. దండోరా కలెక్షన్లపై వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: