📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Movies – ఈ వారం థియేటర్, ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి జాబితా..ఇదే!

Author Icon By Anusha
Updated: September 15, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సెప్టెంబర్‌ నెల టాలీవుడ్‌ (Tollywood) బాక్సాఫీస్‌కు నిజంగా కొత్త ఊపుని తీసుకొచ్చింది. కొన్నాళ్లుగా పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో, ఈ నెల వచ్చిన చిన్న, మధ్య తరహా సినిమాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమా అయినా మంచి కంటెంట్‌ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది.‘లిటిల్ హార్ట్స్’(Little Hearts Movies)మొదట్లో పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. అయితే హృదయానికి హత్తుకునే కథ, సహజమైన నటన, మ్యూజిక్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

నోటా నోటి ప్రచారంతో ఈ సినిమా రోజురోజుకీ ప్రేక్షకాదరణ పెంచుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. చిన్న బడ్జెట్‌ సినిమాలు కూడా కంటెంట్‌ బలంగా ఉంటే ఎలా నిలదొక్కుకుంటాయో ఇది మంచి ఉదాహరణగా నిలిచింది.సెకండ్ వీక్ లో వచ్చిన ‘మిరాయ్‌’, ‘కిష్కింధపురి’ సినిమా (‘Kishkindhapuri’ movie) లు రెండూ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. వీకెండ్ లో భారీ వసూళ్లను సాధించాయి. ఈ మూడు చిత్రాలు థియేటర్లలో ఉండగానే ఈ వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

విజయ్ ఆంటోనీ భద్రకాళి

‘నకిలీ’ ‘సలీం’ ‘బిచ్చగాడు’ వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ., ఇటీవలే ‘మార్గాన్’ మూవీతో మంచి హిట్టు కొట్టాడు. ఇప్పుడు ‘భద్రకాళి’ (Bhadrakaali Movie) అనే మరో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. ఇది ఆయన కెరీర్ మైల్ స్టోన్ సిల్వర్ జూబ్లీ మూవీ. సెప్టెంబరు 19న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. అరుణ్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రుప్తి రవీంద్ర (Trupti Ravindra) హీరోయిన్‌ గా నటించారు. ఇప్పటి వరకూ రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో ఇదొక పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది.

వీర చంద్రహాస

KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌ (Ravi Basrur) దర్శకుడిగా పరిచయం కాబోతున్న సినిమా ‘వీర చంద్రహాస’. ఇందులో శివ రాజ్‌కుమార్‌ అతిథిగా కనిపించనున్నారు. ఇటీవలే కన్నడలో రిలీజైన ఈ సినిమాని ఈ నెల 19న తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇంద్రాణి దావలూరి స్వీయ దర్శక నిర్మాణంలో ‘అందెల రవమిది’ అనే సినిమా కూడా శుక్రవారమే రిలీజ్‌ కానుంది.

బ్యూటీ

‘ది రాజా సాబ్’ డైరెక్టర్ మారుతి సమర్పణలో ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమా ‘బ్యూటీ’. (Beauty) వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ ప్రేమకథా చిత్రంలో అంకిత్‌ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటించారు. సుబ్రహ్మణ్యం రాసిన కథతో ‘భలే ఉన్నాడే’ డైరెక్టర్ శివ సాయి వర్ధన్‌ ఈ సినిమాని తెరకెక్కించారు. ‘తొలి ప్రేమ’ వాసుకీ, వీకే నరేష్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల అక్కినేని నాగ చైతన్య చేతుల మీదుగా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దక్ష

మంచు లక్ష్మి, ఆమె తండ్రి మోహన్ బాబు (Mohan Babu) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దక్ష’. వంశీ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘అగ్నినక్షత్రం’ అనే టైటిల్ తో ప్రమోషన్స్ కూడా చేశారు. ఇప్పుడు పేరు మార్చుకొని సెప్టెంబర్ 19న ఆడియన్స్ ను అలరించడానికి సినిమా హాళ్లలోకి వస్తోంది. ఇదొక క్రైమ్‌ యాక్షన్ థ్రిల్లర్‌. లక్ష్మి పవర్‌ ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సముద్రఖని, చిత్ర శుక్లా కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇటీవల ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడంతో ఈ సినిమాపై జనాల దృష్టి పడింది.

జాలీ ఎల్‌ఎల్‌బీ 3

అక్షయ్ కుమార్, అర్షద్‌ వార్షి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’. ఇదొక బ్లాక్‌ కామెడీ లీగల్‌ డ్రామా. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో చిత్రమిది. సుభాష్‌ కపూర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ ఉంది.

ఓటీటీలో పలు ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌:
ప్లాటోనిక్‌ (వెబ్‌ సిరీస్‌) – సెప్టెంబరు 18
ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ (వెబ్‌ సిరీస్‌) – సెప్టెంబరు 18
బిలియనీర్స్‌ బంకర్‌ (వెబ్‌ సిరీస్‌) – సెప్టెంబరు 19
హాంటెడ్‌ హాస్టల్‌ (వెబ్‌ సిరీస్‌) – సెప్టెంబరు 19
28 ఇయర్స్‌ లేటర్‌ (వెబ్‌ సిరీస్‌) – సెప్టెంబరు 20

జియో హాట్‌స్టార్‌:
పోలీస్‌ పోలీస్‌ (వెబ్‌ సిరీస్‌) – సెప్టెంబరు 19
ది ట్రయల్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – సెప్టెంబరు 19

జీ 5:
హౌస్‌మేట్స్‌ – సెప్టెంబరు 19

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/peddi-movie-big-update-on-peddi-movie/cinema/547682/

box office revival Breaking News kishkindhapuri movie hit latest news little hearts movie hit mirai movie positive talk Telugu News tollywood september success weekend box office collections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.