📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Movie: ‘జన నాయగన్’ చిత్రం విడుదల ఆలస్యం పై స్పందించిన విజయ్

Author Icon By Saritha
Updated: January 31, 2026 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాను నటించిన ‘జన నాయగన్’ చిత్రం (Movie) విడుదల ఆలస్యం కావడంపై నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన సినిమాను ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన కారణంగా నిర్మాతకు నష్టం జరుగుతోందని అన్నారు. తన నిర్మాతల గురించి ఆలోచిస్తే బాధగా ఉందని అన్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేటప్పుడు వీటన్నింటికి సిద్ధపడ్డానని ఆయన పేర్కొన్నారు. తన సినిమాపై ఈ ప్రభావం పడుతుందని ముందే ఊహించానని అన్నారు.

Vijay responded to the delay in the release of the film ‘Jananaayagan’.

Read Also: Ram Charan: 500 డ్యాన్సర్ల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్

వాస్తవానికి ఈ చిత్రం (Movie) డిసెంబర్ 9న విడుదల కావాల్సింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు అదే తేదీన మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై న్యాయస్థానం తాత్కాలికంగా స్టే విధించగా, నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సినిమా విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, మద్రాస్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. ఈ నెల 21న సుదీర్ఘ వాదనల అనంతరం డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన డివిజన్ బెంచ్, దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jan Nayagan Latest News in Telugu Tamil movie release delay Tamil Nadu Politics Telugu News TVK party vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.