📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు

News telugu: Movie Review-లైట్స్ కెమెరా యాక్షన్ సినిమా రివ్యూ

Author Icon By Sharanya
Updated: September 22, 2025 • 6:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ నెల 19న ‘జీ 5’ ఓటీటీ(Zee 5 OTT)లో విడుదలైన మలయాళ చిత్రం ‘లైట్స్ కెమెరా యాక్షన్’, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అనంత్ జయచంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ దర్శకత్వం వహించారు.

కథాంశం:

సుందర్ అనే యువకుడు ఒక మీడియా సంస్థలో రచయితగా పని చేస్తూ జీవితం గడిపేస్తుంటాడు. అతని తల్లి చనిపోవడం, తండ్రి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవడం అతని జీవితాన్ని మారుస్తుంది. అమ్మమ్మ సంరక్షణలో పెరిగిన సుందర్, తన తండ్రిపై ఎన్నో ప్రశ్నలతో జీవిస్తుంటాడు.ఒక రోజు అతనికి తండ్రి సంబంధిత ఒక వీడియో టేప్ దొరుకుతుంది. దానిలో అతని తండ్రి బీ గ్రేడ్ సినిమాలు తీసే డైరెక్టర్ అని తెలుస్తుంది. ఆ సినిమాలో న‌టించిన నాన్సీ(Nancy) అనే నటి ద్వారా ఆ సంబంధాల్ని తెలుసుకోవాలనుకుంటాడు. తన స్నేహితుడు బాలు తో కలిసి నాన్సీ కోసం గాలింపు ప్రారంభిస్తాడు.

నాన్సీ ఎవరు? తండ్రి ఏమయ్యాడు?

నాన్సీ అడ్రస్ దొరికాక, అక్కడికి వెళ్లిన తర్వాత వారికి ఎదురయ్యే అనూహ్య పరిస్థితులు, నాన్సీపై బయటపడే నిజాలు, సుందర్ తండ్రి జీవితం చివరకు ఎలా ఉండిందన్నదే మిగతా కథ.

విశ్లేషణ: కథకు ట్రీట్మెంట్ లో తేడా

మలయాళ సినిమాలు సాధారణంగా చిన్న కథలు చెప్పినా, వాటిని ఆసక్తికరంగా ట్రీట్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఆ ట్రీట్మెంట్ లోపించింది. కథ సాదారణం అయినప్పటికీ, స్క్రీన్‌ప్లే తేలిపోయింది.చిన్న కథలకి బలం కావాల్సింది ఊక్కో మలుపు, ఆకట్టుకునే పాత్రలు, భావోద్వేగాలు. కానీ ఈ చిత్రంలో అవేవీ స్పష్టంగా కనిపించవు. కథ నెమ్మదిగా సాగుతుంది, ఎలాంటి ఉద్వేగాన్ని రేకెత్తించదు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ అయింది.

నటన & సాంకేతికత:

నటీనటుల నటన గురించి మాట్లాడుకోవడానికి గొప్ప పరిధి లేదు. పాత్రలు బలహీనంగా ఉండడంతో, వారి ప్రదర్శన కూడా పలుచగా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ – అన్నీ మామూలుగానే అనిపిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bigg-boss-telugu-9-week-2-manish-eliminated/cinema/bigg-boss/552131/

Breaking News latest news LightsCameraAction MalayalamMovies MovieReview Telugu News TeluguReview ZEE5Movies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.