విభిన్నమైన పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మనోజ్ బాజ్ పాయ్, మరోసారి ఓటీటీ లో కొత్త ప్రయత్నంతో ముందుకొచ్చారు. ‘ఇన్ స్పెక్టర్ ఝండే’ అనే కామెడీ థ్రిల్లర్ కథతో ఈసారి మలచిన ఈ ప్రయోగం, నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. దర్శకుడు చిన్మయ్ డి మండ్లేకర్ ఈ కథను తెరపైకి తీసుకురావడంలో కొన్ని వైఫల్యాలను ఎదుర్కొన్నట్టు స్పష్టమవుతుంది.
కథాంశం:
1970ల నుండి 1986 మధ్యకాలంలో తీహార్ జైలు (Tihar Jail)నుండి కరడుగట్టిన నేరస్థుడు కార్ల్ భోజ్ రాజ్ (జిమ్ కర్బ్) తప్పించుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. అతనిని పట్టుకోవాలన్న క్రమంలో ఇన్ స్పెక్టర్ మధుకర్ ఝండే (మనోజ్ బాజ్ పాయ్) రంగంలోకి దిగతాడు. అంతర్జాతీయ నేరాల పట్ల అనుభవమున్న ఈ పోలీస్ ఆఫీసర్, తన టీమ్‌తో కలిసి గోవాలో భోజ్ రాజ్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొనే సవాళ్లు, సంఘటనలే కథను ముందుకు నడిపిస్తాయి.
నిరీక్షణలపై నిజాలు – కథలో లోపాలు:
కథ మొదటి నుండి ఆసక్తికరంగా ఉండొచ్చని అనిపించినా, అసలు కథన విధానం చాలా సుతారంగా సాగుతుంది. భోజ్ రాజ్ వంటి ప్రమాదకర నేరస్థుడిని పట్టుకోవడమంటే, పోలీసులచే ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నాలు, అద్భుతమైన ప్లానింగ్ ఉండాలి. కానీ సినిమాలో అవి కనిపించవు. పోలీస్ ఆఫీసర్లు సీరియస్ గా కాకుండా ఒక కామెడీ బ్యాచ్ మాదిరిగా కనిపిస్తారు. ఇది ప్రేక్షకుడిలో ఆసక్తికి బదులుగా నిరాశను కలిగిస్తుంది.
దర్శకుడు చిన్మయ్ ఒక సీరియస్ కథను హాస్యమయంగా చూపించాలనే ప్రయత్నం చేశాడు. కానీ ఇది కనీసం సరదాగా అనిపించకపోవడం లోపం. కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా, ముఖ్యమైన సన్నివేశాలను చాలా తేలికగా తీసుకెళ్లారు.
నటుల ప్రదర్శన:
మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpai)తన స్థాయికి తగ్గట్టు నటనతో ఆకట్టుకుంటారు. ఆయన భార్య పాత్రలో గిరిజ ఓక్ కూడా బాగానే చేశారు. కానీ మంచి నటన ఉన్నా, బలహీనమైన స్క్రీన్ ప్లే వాళ్ల పనితీరును మిగిలిన చిత్రానికి లేవదీయలేకపోయింది. సీరియస్ క్రైమ్ కథను కామెడీ టచ్‌తో చెప్పాలనే ప్రయత్నం ఈ సినిమా. కానీ కథనంలో లోతులేకపోవడం, సీరియస్ పాయింట్లను తేలికగా తీసుకోవడం వల్ల ఇది సాదాసీదాగా కనిపిస్తుంది. ఒక అంతర్జాతీయ నేరస్థుడి చుట్టూ నడిచే కథగా ఊహించుకున్న ఈ సినిమా, ప్రేక్షకుడికి పెద్దగా తృప్తిని ఇవ్వదు.
Read hindi news hindi.vaartha.com
Read also