📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Movie Piracy: పైరసీ భూతానికి ‘సైబర్’ చెక్: రంగంలోకి TGCSB ప్రత్యేక యూనిట్

Author Icon By Aanusha
Updated: March 17, 2026 • 8:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Movie Piracy: తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ మహమ్మారిని వేళ్లతో సహా పెకిలించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) నడుం బిగించింది. ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్న పైరసీ గ్యాంగులపై ఉక్కుపాదం మోపేందుకు సరికొత్త యాంటీ పైరసీ యూనిట్‌ను, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను అందుబాటులోకి తెచ్చింది.

Read Also: Oscar Winners 2026 Full List Telugu: ఆస్కార్ 2026లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ప్రభంజనం

Movie Piracy: ‘Cyber’ check on the piracy menace: TGCSB special unit enters the field

ప్రేక్షకుల్లో అవగాహన పెంచడమే లక్ష్యం

దానిలో భాగంగా థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు, పైరసీ నిరోధక డిస్‌క్లెయిమర్‌ను తప్పకుండా ప్రదర్శించాలి. ప్రేక్షకుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక థియేటర్లలో సినిమాలను రికార్డ్ చేస్తే…3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 3 లక్షల రూపాయల భారీ జరిమానా విధిస్తారని ఆ డిస్‌క్లెయిమర్ హెచ్చరిస్తుంది. ఇక పైరసీ కేసులను సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

కొత్త SOPలో భాగంగా FIR నమోదు, డిజిటల్ ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ పరీక్షలు, వాటర్‌మార్కింగ్ ద్వారా లీక్ జరిగిన థియేటర్‌ను గుర్తించడం వంటి చర్యలు తీసుకుంటారు. పైరసీ URLలను బ్లాక్ చేయడానికి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో అధికారులు సమన్వయం చేసుకుంటారు. ఇక పైరసీ మూలాలను గుర్తించేందుకు సినిమా విడుదలైన తర్వాత కనీసం ఒక నెల పాటు CCTV ఫుటేజ్‌ను భద్రపరచాలని థియేటర్ల యజమానులకు పోలీస్‌ అధికారులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

cyber security bureau Telangana movie piracy TGCSB Anti Piracy Tollywood Piracy Loss

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.