సినిమా రేటింగ్స్, రివ్యూలకు అత్యంత ప్రామాణిక వేదికగా భావించే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) ఈ ఏడాదికి గాను అత్యంత ప్రజాదరణ పొందిన (Most Popular Directors of 2025) భారతీయ స్టార్లు, దర్శకుల జాబితాను తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను రూపొందించింది. అయితే ఈ జాబితాలో తెలుగు నుంచి ఒక్క దర్శకుడు (Most Popular Directors of 2025) కూడా చోటు దక్కించుకోకపోవడం విశేషం.
Read Also: Imdb Most Popular Indian Stars of 2025: ఐఎండీబీ 2025 పాపులర్ తారల జాబితా విడుదల
మొహిత్ సూరి – ‘సయ్యారా’
సైయారాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మోహిత్ సూరి (Mohit Suri) ఈ ఏడాది మోస్ట్ పాపులర్ దర్శకులలో అగ్ర స్థానంలో నిలిచాడు.
ఆర్యన్ ఖాన్ – ‘The Ba*ds of Bollywood’**
బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌తో ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచాడు.
లోకేష్ కనకరాజ్
కూలీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) మూడో స్థానంలో నిలువగా..
అనురాగ్ కశ్యప్
నిశాంఛీతో హిట్ అందుకున్న అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) నాలుగో స్థానం.
పృథ్వీరాజ్ సుకుమారన్
‘L2: Empuraan’ ను దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు. పృథ్వీరాజ్ఐదో స్థానంలో నిలిచారు.
ఆర్.ఎస్. ప్రసన్న
ఆమిర్ ఖాన్‌తో సితారే జమీన్ పర్ లాంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్న (R.S. Prasanna) ఆరో స్థానంలో నిలువగా..
అనురాగ్ బసు
మెట్రో ఇన్ డినోతో అనురాగ్ బసు (Anurag Basu) ఏడో స్థానంలో నిలిచాడు.
డొమినిక్ అరుణ్
మలయాళం కొత్త లోక సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు డొమినిక్ అరుణ్ (Dominic Arun) ఎనిమిదో స్థానంలో చోటు దక్కించుకోగా..
లక్ష్మణ్ ఉటేకర్
ఛావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) 9వ స్థానం, హోమ్ బౌండ్ చిత్రంతో నీరజ్ ఘైవాన్ (Neeraj Ghaywan) 10వ స్థానంలో చోటు దక్కించుకున్నాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: