📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Latest News: Mithra Mandali Movie: మిత్ర మండలి మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: October 16, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రాల్లో ‘మిత్రమండలి’ (Mithra Mandali Movie) ఒకటి. హీరో ప్రియదర్శి చేసిన స్టేట్‌మెంట్‌ “ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడకండి” — రిలీజ్‌కు ముందు మంచి హైప్‌ తీసుకొచ్చింది. నిర్మాత బన్నీ వాసు చేసిన బోల్డ్ ప్రమోషన్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే సినిమాను చూసిన తర్వాత ప్రేక్షకులు “ఇది నిజంగానే కథలేని కథనా?” అని ఆశ్చర్యపోతున్నారు.

Read Also: Bunny Vasu: బుక్ మై షో పై బన్నీ వాసు ఫైర్

దర్శకుడు మొదటినుంచే క్లారిటీ ఇచ్చాడు — “ఇందులో కథ ఉండదు, కేరెక్టర్లే కథ” అని. అదే వాగ్దానం ఆయన నిలబెట్టుకున్నాడు కూడా. సినిమా మొదటి నిమిషం నుంచే జంగ్లీ పట్టణం (Jungle town) అనే ఊరి పరిచయంతో మొదలవుతుంది. అక్కడ నలుగురు స్నేహితులుఉంటారు.రోజంతా ఊరంతా తిరుగుతూ, చిన్న చిన్న గ్యాంగ్‌ ఫైట్లలో, లవ్ ట్రాక్స్‌లో ఇరుక్కుపోతూ గడుపుతారు.ఈ రోజు ఈ సినిమా థియేటర్ లోకి వచ్చింది..ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం.

కథ

‘మిత్రమండలి’ అనేది ఒక వాట్సాప్ గ్రూప్‌. ఇందులో చైతన్య (ప్రియ‌ద‌ర్శి), అభి (రాగ మ‌యూర్‌), సాత్విక్ (విష్ణు ఓయి సా), రాజీవ్ (ప్ర‌శాంత్ బెర‌హా).. ఈ నలుగురి ‘మిత్రమండలి’ ఇందులోని సభ్యులు. రాత్రి అయితే తాగడం.. తిరగడం.. ఇంట్లో వాళ్లంతో తన్నులు తినడం ఇదే వీళ్ల పని. వీళ్లు ఉండే జంగ్లీ పట్నంలో నారాయణ (వీటీవీ గణేష్) కి విపరీతమైన కులపిచ్చి.కులాన్ని వెనకేసుకుని ఎమ్మెల్యే సీటు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తుంటాడు.

సరిగ్గా సీటు ఇచ్చే టైమ్‌కి నారాయణ కూతురు స్వేచ్ఛ (నిహారిక).. వేరే కులపోడైన చైతన్య (ప్రియ‌ద‌ర్శి)తో స్వేచ్ఛ, పారిపోతుంది. దానివల్ల చైతన్య సహా.. ముగ్గురు మిత్రులు చిక్కుల్లో పడతారు. పరువు-పదవి-కులపిచ్చి నేపథ్యంలో నారాయణ తన కూతురి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చివరికి అతనికి మిగిలింది ఏంటి? అనే విషయాన్ని మిత్రమండలి (Mithra Mandali Movie) లో సెటారికల్‌గా చూపించారు.

Mithra Mandali Movie

ఏంటీ?? కా..మెడీ సినిమా అంటే అంత కా..మెడీగా ఉందా? ఏడిపించడమైనా కాస్త ఈజీనేమో కానీ.. నవ్వించడం, మోముపై నవ్వులు కురిపించడం.. మనస్ఫూర్తిగా నవ్వేట్టు చేయడం అంటే కామెడీ కాదు. ఇది మాత్రం చాలా సీరియస్ మ్యాటరే సుమీ. ఇలాంటి సీరియస్ మ్యాటర్‌ని సాఫీగా డీల్ చేస్తే కామెడీ వర్కౌట్ అవుతుంది. కాస్త తేడా కొట్టిందంటే హాస్యం కాస్తా అపహాస్యం అవుతుంది. మిత్రమండలి విషయంలే అదే అయ్యింది.

మిత్ర మండలి మూవీ చూసారా ..అయితే ఎలా ఉందొ కామెంట్ చేయండి?

విశ్లేషణ

ప్రియదర్శి, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం.. వీళ్లతో పాటు చాలామంది కమెడియన్‌లు కనిపిస్తూనే ఉంటారు.. పంచ్‌లు వినిపిస్తూనే ఉంటారు ‘మిత్ర మండలి’లో. కానీ మనస్పూర్తిగా నవ్వుకోవడానికి.. హాయిగా అనిపించడానికి ఫన్‌ని జనరేట్ చేసే సీన్లు కనిపించవు.

కథ పరంగా.. తుట్ట కులం అనే ఫిక్షనల్ క్యాస్ట్ నేమ్ పెట్టి కులపిచ్చిని ఉద్దేశించి సెటైరికల్‌గా సందేశాన్ని ఇవ్వడం వరకూ సినిమా లైన్ బాగానే ఉంది. కానీ దాన్ని ప్రజెంట్ చేయడంలో మిస్ ఫైర్ అయ్యింది. స్క్రిప్ట్‌లేకుండా చేసిన స్కిట్‌ల మాదిరిగానే కనిపిస్తాయి చాలా సీన్లు. కామెడీ పండించే మంచి మంచి నటీనటులున్నా.. వారి ఓవరాక్షన్‌తో ఓవర్ బోర్డ్ అనిపిస్తాయంటే.. అది దర్శకుడి వైఫల్యమే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

latest news mithramandali movie review Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.