📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

meghalaya murder case: ప్రేక్షకుల ముందుకు రానున్న హనీమూన్ మర్డర్ కేసు

Author Icon By Ramya
Updated: July 30, 2025 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసు (meghalaya murder case) ఆధారంగా బాలీవుడ్‌లో ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఎస్.పి. నింబావత్ (S.P. Nimbawat) దర్శకత్వం వహించనున్నారు.

సినిమా నేపథ్యం

meghalaya murder case: రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు ఈ సినిమా నిర్మాణానికి తమ సమ్మతి తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో, భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా అవగాహన కల్పించేందుకు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు దర్శకుడు నింబావత్ పేర్కొన్నారు. సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. చిత్రీకరణలో 80 శాతం ఇండోర్‌లో, మిగిలిన 20 శాతం మేఘాలయలో జరుగుతుందని నింబావత్ తెలిపారు. అయితే, నటీనటుల వివరాలు ఇంకా వెల్లడించలేదు.

meghalaya murder case: ప్రేక్షకుల ముందుకు రానున్న హనీమూన్ మర్డర్ కేసు

కేసు వివరాలు

ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి, సోనమ్ రఘువంశీకి (Raja Raghuvanshi, Sonam Raghuvanshi) ఈ ఏడాది మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లిన ఈ కొత్త దంపతులు అదృశ్యమయ్యారు. పదకొండు రోజుల తర్వాత, రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు లోయలో గుర్తించారు. మొదట అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

జూన్ 7న సోనమ్ రఘువంశీ ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఒక డాబా వద్ద కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని, వారి బారి నుంచి తప్పించుకుని వచ్చానని పోలీసులకు తెలిపింది. అయితే, పోలీసుల విచారణలో సోనమ్ రఘువంశీ తన ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్లు తేలింది. ఈ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మేఘాలయ హత్య కథ?

జూన్ 2న లోతైన లోయలో రఘువంశీ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమైంది, గతంలో కనిపించకుండా పోయిన అతని భార్యను జూన్ 9న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో అరెస్టు చేశారు . మిగిలిన నలుగురు నిందితులను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి అరెస్టు చేశారు.

మేఘాలయ హనీమూన్ కేసులో ఏం జరిగింది?

మే 23న సోహ్రా (చిరాపుంజి) ప్రాంతం నుండి రాజా మరియు సోనమ్ కనిపించకుండా పోయారు. జూన్ 2న జలపాతం సమీపంలోని లోతైన లోయ నుండి రాజా మరియు సోనమ్ కుళ్ళిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు, జూన్ 9న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసుల ముందు లొంగిపోయారు. “ఈ కుట్రలో తాము కూడా భాగమని సోనమ్ మరియు రాజ్ అంగీకరించారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also:  Rangeen Review : రంగీన్ సిరీస్ రివ్యూ!

bollywood crime thriller Breaking News honeymoon in shillong movie latest news meghalaya murder case raja raghuvanshi Sonam Raghuvanshi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.