Megastar Chiranjeevi NTR National Award: తెలంగాణ గద్దర్ అవార్డుల వేదికపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయనను ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ (NTR National Award) తో సత్కరించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా చిరంజీవికి అందజేసి, శాలువా కప్పి జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం మెగాస్టార్ అభిమానుల కోలాహలంతో మారుమోగిపోయింది.
Read also: Gaddar Film Awards 2026: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: హైటెక్స్‌లో తారల సందడి
ప్రభుత్వానికి చిరంజీవి కృతజ్ఞతలు
పురస్కారం అందుకున్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం అవార్డులు ప్రవేశపెట్టి, కళాకారులను ప్రోత్సహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవను ఆయన కొనియాడారు. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డు అందుకోవడం తనకెంతో గర్వంగా ఉందని, అది కూడా ఎన్టీఆర్ పేరు మీద ఈ పురస్కారం దక్కడం తన జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకమని చిరంజీవి వ్యాఖ్యానించారు.
Megastar Chiranjeevi NTR National Award: కళాకారుల పండుగగా గద్దర్ అవార్డుల వేడుక
హైటెక్స్‌లో జరుగుతున్న ఈ అవార్డుల ప్రదానోత్సవం ఒక సాంస్కృతిక పండుగను తలపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు నిలిచిపోయిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఆ స్థాయిలో కళాకారులను, సాంకేతిక నిపుణులను గౌరవించేందుకు ఈ వేదికను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పలువురు సినీ ప్రముఖులు, కవులు, మరియు కళాకారులు అవార్డులు అందుకున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఈ వేడుకలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: