సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపధ్యంలో తాజాగా విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో చిరంజీవి (Chiranjeevi)స్టైలిష్‌గా, యూత్‌ఫుల్‌గా కనిపిస్తూ తన టైమ్‌లెస్ ఛార్మ్‌ను మరోసారి రుజువు చేశారు.
Read Also: Dhurandhar Movie: ధురంధర్‌పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు
జనవరి 12న థియేటర్లలో విడుదల
వింటేజ్ లుక్‌తో పాటు గ్రేస్, ఎనర్జీ కలగలిపిన ఈ స్టిల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అభిమానులను ఉత్తేజపరుస్తూ ఓ ప్రత్యేక పోటీని కూడా ప్రారంభించారు. విడుదల చేసిన కొత్త స్టిల్స్‌తో క్రియేటివ్ డిజైన్లు రూపొందించాలని,
వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రత్యేక ‘MSG’ మర్చండైజ్ బహుమతిగా అందిస్తామని తెలిపారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార, కేథరిన్ త్రెసా నటిస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేశ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: