📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Meera Mithun: తమిళ నటి మీరా మిథున్‌ అరెస్ట్‌

Author Icon By Ramya
Updated: August 6, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దళితులపై అనుచిత వ్యాఖ్యల కేసులో మీరా మిథున్ అరెస్ట్

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తమిళ నటి మీరా మిథున్‌ను (Meera Mithun) ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె గత మూడేళ్లుగా ఈ కేసులో పరారీలో ఉంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఈ నెల 11న కోర్టులో హాజరుపరచనున్నారు.

కేసు వివరాలు

2021 ఆగస్టులో, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీరా మిథున్ (Meera Mithun) మరియు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్‌ (Shyam Abhishek) ను అరెస్టు చేశారు. అప్పుడు వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, వారు కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో 2022లో కోర్టు వారిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పటి నుండి మీరా మిథున్ పరారీలో ఉంది.

Meera Mithun

అరెస్టుకు దారితీసిన పరిణామాలు

తాజాగా, మీరా మిథున్ తల్లి, తన కుమార్తెను రక్షించి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణలో, చెన్నై లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఢిల్లీలోని లీగల్ సర్వీసెస్ అథారిటీకి (Legal Services Authority) సమాచారం అందించారు. వారి సాయంతో ఢిల్లీ పోలీసులు మీరా మిథున్‌ను గుర్తించారు. ఆమెను ప్రసుత్తం అక్కడి ప్రభుత్వ హోమ్‌లో ఉంచారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఈ నెల 11న కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ అరెస్టుతో ఈ కేసులో ఆమె పరారీ పర్వం ముగిసింది.

మీరా మిథున్‌కి ఏమైంది?

చెన్నై: దళితులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గత మూడేళ్లుగా పరారీలో ఉన్న నటి, మోడల్, యూట్యూబర్ మీరా మిథున్‌ను 2021లో జరిగిన సంఘటనకు సంబంధించి అరెస్టు చేశారు.

మీరా మిథున్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె 3 ఏళ్లుగా పరారీలో ఉంది.

మీరా మిథున్‌ను ఎప్పుడు కోర్టులో హాజరుపరచనున్నారు?

కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఆగస్టు 11న కోర్టులో హాజరుపరచనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/it-would-have-been-better-if-time-had-stopped-there-heroine-nirosha/cinema/actress/526530/#google_vignette

Breaking News controversial comments dalit remarks case delhi police latest news Meera Mithun tamil actress arrest Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.