📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Meenakshi Chowdhury: కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి ఎంట్రీ?

Author Icon By Anusha
Updated: February 8, 2026 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury), కన్నడ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రక్షిత్ శెట్టి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘777 చార్లీ’ సీక్వెల్‌లో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం మీనాక్షి నాగచైతన్యతో ‘వృషకర్మ’తో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

Read Also: Aishwarya Arjun: సీతా పయనం ట్రైలర్‌ రిలీజ్

Meenakshi Chowdhury’s entry into Kannada cinema?

పాజిటివ్ టాక్‌

ఇటీవల కాలంలో తెలుగులో మీనాక్షి (Meenakshi Chowdhury) వరుస హిట్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘ సంక్రాంతికి వస్తున్నాం ’ వంటి చిత్రాలు ఆమె ఖాతాలో భారీ విజయాలుగా నిలిచాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మీనాక్షి క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిందని చెప్పొచ్చు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ నంబర్స్ నమోదు చేయడంతో పాటు, ఆమెను స్టార్ హీరోయిన్ల జాబితాలో నిలబెట్టింది. ఇక మొన్న సంక్రాంతికి విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ కూడా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. చిన్న కథతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మీనాక్షి నటనకు మరోసారి మంచి పేరు తెచ్చిపెట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

777 Charlie sequel Kannada Film latest news Meenakshi Chaudhary Rakshit Shetty movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.