📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Meenakshi Chowdhury: చీరలో మైమరిపిస్తున్న మీనూ

Author Icon By Sharanya
Updated: May 15, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినిమా పరిశ్రమలో తన ప్రత్యేకతను చాటుకుంటూ, టాలీవుడ్‌లో వరస విజయాలతో దూసుకెళ్లుతున్న నటి మీనాక్షి చౌదరి, ఇటీవల చీరలో అందాల ఫొటోషూట్‌తో సోషల్ మీడియా (Social media) లో సంచలనం సృష్టించింది. తన చీరలో సన్న జాజి తీగలతో అందంగా కనిపిస్తూ, అభిమానులను మైమరచేలా చేసింది.

సినిమా కెరీర్:

మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) హిందీ చిత్రం ‘అప్ స్టార్స్’ ద్వారా నటిగా పరిచయమైంది. హిందీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని, ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో, గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వరసగా ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి. దీని తర్వాత వరసగా ఈ అందాల ముద్దుగుమ్మ ఖిలాడీ, హిట్2 , గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, మట్కా, మెకానీకి రాఖీ వంటి సినిమాల్లో నటించి, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ముఖ్యంగా ఈ చిన్నది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం:

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో మీనాక్షి చౌదరి, వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్‌గా నటించి, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో వరసగా హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన వరస ఫొటో షూట్‌తో కుర్రకారును మాయ చేస్తుంటుంది.

సోషల్ మీడియాలో వైరల్‌

మీనాక్షి చౌదరి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన తాజా ఫొటోషూట్‌లు, సినిమాల అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా చీరలో చేసిన ఫొటోషూట్, నెట్టింట్లో వైరల్‌గా మారింది. తాజాగా ఈ బ్యూటీ సిల్క్ చీరలో అందంగా రెడీ అయ్యి ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ చిన్నది చాలా బ్యూటిపుల్‌గా కనిపిస్తుంది. తన చిలిపి నవ్వుతో అభిమానులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Read also: SS Rajamouli: ఆర్ఆర్ఆర్ 2 పై అప్డేట్ ఇచ్చిన జక్కన్న

#BeautyinSari #MeenakshiChoudhary #MeenakshiInSaree #MeenakshiMagic #SareeVibes #StylishBeauty #TollywoodBeauty Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.