हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’లో గెస్ట్ రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన మనోజ్

Anusha
Latest News: Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’లో గెస్ట్ రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన మనోజ్

మంచు మనోజ్ (Manchu Manoj) చాలా ఏళ్ల తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా ‘డేవిడ్ రెడ్డి’. (David Reddy movie) హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి దీనికి నిర్మాతలు. బ్రిటీష్ ఇండియా కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా స్టోరీతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నటుడు శింబు అతిథి పాత్రల్లో కనిపించనున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ప్రచారానికి మనోజ్ (Manchu Manoj) తెరదించారు. ఆ వార్తల్లో నిజం లేదని, ఇప్పటివరకూ ఆ పాత్రల కోసం తాము ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.

Read Also: Chinmayi: నిధీ అగర్వాల్ ఘటనపై చిన్మయి ఫైర్

Manoj clarifies on guest roles in 'David Reddy'
Manoj clarifies on guest roles in ‘David Reddy’

ఇంకా చాలా సమయం ఉంది

బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు మనోజ్ బదులిస్తూ.. “సినిమాలో అతిథి పాత్రలకు మంచి స్కోప్ ఉంది. కానీ, ఆ పాత్రల కోసం ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ వివరాలు నేనే వెల్లడిస్తాను” అని వివరించారు.

ఈ సినిమాలో ‘వార్ డాగ్’ అనే ప్రత్యేకమైన బైక్ కీలక పాత్ర పోషిస్తుందని మనోజ్ తెలిపారు. ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రంలోని ‘బుజ్జి’ కారును రూపొందించిన బృందమే ఈ బైక్‌ను కూడా తయారు చేసిందని చెప్పారు. సుమారు 700 కేజీల బరువుండే ఈ బైక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870