Vijay Sethupathi-Sai Pallavi: మణిరత్నం తన 19వ సినిమా కోసం మళ్ళీ ఏఆర్ రెహమాన్‌తో చేతులు కలిపారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, వాటన్నింటికీ చెక్ పెడుతూ మద్రాస్ టాకీస్ సంస్థ రెహమాన్ పేరును ఖరారు చేసింది. దీంతో ఈ లెజెండరీ కాంబో మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది.
Read Also: Guvvala Cheruvu Ghat Web Series First Look: ‘గువ్వల చెరువు ఘాట్’ నుంచి గ్లింప్స్ విడుదల
మణిరత్నం సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి
1992లో ‘రోజా’ సినిమాతో మొదలైన వీరిద్దరి అద్భుత ప్రయాణం, ఇప్పుడు 19వ సారి ఈ కొత్త సినిమాతో కొనసాగబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి హీరోగా నటించబోతుండగా.. ‘నేచురల్ స్టార్’ సాయి పల్లవి మణిరత్నం సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుంది.
ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం రెహమాన్ ఇప్పటికే ఒక పాటను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూలై నాటికి ప్రారంభం కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: