📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Manchu Manoj: మంచు మనోజ్ న్యూ జర్నీ

Author Icon By Aanusha
Updated: November 22, 2025 • 9:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు దక్కించుకున్న హీరో మంచు మనోజ్(Manchu Manoj). సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతున్న మంచు వారబ్బాయి.. మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అందులో భాగంగా మనోజ్ తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ ‘మోహన రాగ మ్యూజిక్’ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

Read Also: Mohan Babu: తండ్రి గోల్డెన్ జర్నీపై ఎమోషనల్ అయిన మంచు విష్ణు

Manchu Manoj New Journey

సంగీత ప్రపంచంలోకి 

చాలా ఏళ్లుగా తన మనసులో దాగి ఉన్న ఈ కల నేడు నెరవేరిందని మనోజ్ (Manchu Manoj) భావోద్వేగంగా వెల్లడించారు.మ్యూజిక్ అంటే తనకు ఎంతో ఇష్టమని… ఈ సంస్థ ద్వారా న్యూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించనున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.మనోజ్ తండ్రి డాక్టర్ మంచు మోహన్ బాబు, అన్న మంచు విష్ణు, అక్క లక్ష్మీ మంచు సినిమాలకు సంగీతం, యాక్షన్ విభాగాల్లో కూడా పనిచేసిన విషయాన్ని మనోజ్ గుర్తుచేశారు.

హాలీవుడ్ చిత్రం Basmati Blues కోసం సంగీత దర్శకుడు అచ్చు రాజమణితో కలిసి పనిచేయడం ఆయనకు మరో పెద్ద మైలురాయి. “మోహన రాగ” అనే పేరుకు తనకూ, తన కుటుంబానికీ ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సహకారంతో రూపొందుతున్న తొలి ప్రాజెక్టుల్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. తెలుగు సంగీతాన్ని ప్రపంచానికి మరింత దగ్గర చేయడమే తన ఆశ అని మనోజ్ పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news Manchu Manoj music Mohana Raga Music Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.