టాలీవుడ్‌లో మళ్లీ వెలుగులోకి వచ్చిన హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఇటీవల తన కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయిని సాధించారు. యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన సినిమాలో విలన్‌గా నటించిన మనోజ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను పూర్తిగా మాయ చేసేశారు. సినిమా విడుదలైన వెంటనే ఆయన ప్రదర్శనపై అభిమానులు, సినిమా విమర్శకులు,ప్రశంసల వర్షం కురిపించారు.
బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి ఈ ఏడాది టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ ఆనందాన్ని తన కుటుంబంతో పాటు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్న మనోజ్ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు.‘మిరాయ్’ (Mirai) సక్సెస్ మూడ్‌లో ఉన్న మంచు మనోజ్ తన జీవితంలోని ప్రత్యేక క్షణాలని పంచుకున్నారు.
అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించారు
తాజాగా ఆయన అయోధ్య (Ayodhya) లోని రామ మందిరాన్ని దర్శించారు. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన ఆయన.. ‘అయోధ్యలోని రామ మందిరం (Rama Mandir) లో ప్రతి అడుగు రామ్‌లల్లా ఆధ్యాత్మిక కాంతితో, దివ్య సాన్నిధ్యంతో నిండిపోయింది. మన అందరి ఆనందం, ఆరోగ్యం, విజయం కోసం ఆయన్ని ప్రార్థించా’ అని రాసుకొచ్చారు.
చాలాకాలం తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన మనోజ్‌కి ‘మిరాయ్’ సక్సెస్ బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ క్రేజ్‌తో ఆయనకు మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంద. చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రంలో మనోజ్‌ని విలన్ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే మనోజ్ పంట పండినట్లేనని చెప్పాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: