తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి సీజన్ కొత్త క్రీయేటివిటీ, నూతన స్టార్స్ వాస్తు ఉంటారు.. ఇందులో ముఖ్యంగా కొత్త భామలు స్టార్ హీరోల సరసన అవకాశాలను పొందుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం జోరు చూపుతున్నారు.. పాత హీరోయిన్లు కొందరు కొంతకాలం తర్వాత ఔట్‌డేటెడ్ అవుతున్నారని, మరికొందరు బాలీవుడ్ అవకాశాలపై ఎక్కువ ఫోకస్ చేయడంతో, టాలీవుడ్ మేకర్స్ ప్రధానంగా యువ భామలపై దృష్టి పెట్టారు. ఈ పరిస్థితిలో కొత్త, ఫ్రెష్ ఫేస్‌లు స్టార్ హీరోల పక్కన ఛాన్సులు పొందడం మొదలైంది.
Read Also: Chiranjeevi: మీసాల పిల్ల పాట లిరికల్ వీడియో విడుదల
రుక్మిణి వసంత్, కయాదు లోహర్, రితికా నాయక్ వంటి భామలు వరుసగా ఆఫర్లు పొందుతూ, స్టార్ హీరోయిన్ రేసులో దూసుకుపోతోన్నారు. వారు వారి నటనా నైపుణ్యం, స్క్రీన్ ప్రెజెన్స్, యూత్‌ఫుల్ లుక్‌తో దర్శకుల, ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ పరిస్థితిలో మరో హాట్ బ్యూటీ కూడా తన సత్తాను నిరూపిస్తోంది, ఆమె పేరు మాళవిక మోహనన్ (Malavika Mohanan).
డబ్బింగ్ చిత్రాల ద్వారానే తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఆమె ‘ది రాజా సాబ్’ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సోషల్‌మీడియా (Social media) లో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకి సెగలు రేపే ఈ బ్యూటీ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2013లో ‘పట్టం పోల్’ అనే మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు తమిళం, హిందీ చిత్రాల్లోనూ నటించింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు
లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్లో విజయ్ (Vijay) హీరోగా 2021లో వచ్చిన ‘మాస్టర్’ మూవీతో తెలుగువాళ్లకు పరిచయమైంది. ఆ తర్వాత రజనీకాంత్ ‘పెట్టా’, ధనుష్ ‘మారన్’, విక్రమ్ ‘తంగళాన్’ చిత్రాల్లో నటించింది.’వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 5వ తేదీన పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action entertainer) గా ఈ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ను ఎంపిక చేశారని సమాచారం.
సీనియర్ స్టార్లతో కలిసి పనిచేసి
ఇప్పటికే ప్రభాస్ సరసన నటిస్తున్న మాళవిక, గతంలో ‘తంగలాన్’లో విక్రమ్, మలయాళంలో మోహన్‌లాల్ వంటి సీనియర్ స్టార్లతో కలిసి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మెగాస్టార్‌తో జతకట్టే అవకాశం దక్కించుకుంది.గతంలో ‘తంగలాన్’లో విక్రమ్, మలయాళంలో మోహన్‌లాల్ వంటి సీనియర్ స్టార్లతో కలిసి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, ‘మిరాయ్’ చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్
చిరంజీవి పుట్టినరోజున అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నారు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో ‘విశ్వంభర’ చిత్రాన్ని పూర్తి చేయగా, మరోవైపు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా చివరి దశ చిత్రీకరణలో ఉంది.
చిరంజీవి మాళవిక మోహనన్ జోడి పై మీ కామెంట్?
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తికాకముందే బాబీతో మరో సినిమాను మొదలుపెడుతుండటం ఆయన స్పీడ్‌కు అద్దం పడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: