📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Naga Chaitanya: నాగ‌చైత‌న్య కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించిన మేక‌ర్స్‌

Author Icon By Anusha
Updated: November 23, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినిమాలో తనదైన శైలితో ముందుకు సాగుతున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా,ఆయన నటిస్తున్న 24వ చిత్రం (NC24) టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్‌. ‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు ‘వృషకర్మ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.

Read Also: Smriti Mandhana: నేడు స్మృతి మంధాన వివాహం

నాగ చైతన్య ఫస్ట్ లుక్‌, టైటిల్ పోస్టర్‌ విడుదల

సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా నాగ చైతన్య (Naga Chaitanya) ఫస్ట్ లుక్‌తో కూడిన టైటిల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. మహేశ్ బాబు చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ లుక్ బాగుందని ప్రశంసించారు. సంస్కృత మూలాలు ఉన్న ‘వృషకర్మ’ అనే పదానికి కార్యసాధకుడు (చేసే పనిపై శ్రద్ధ ఉన్నవాడు, దానిని సాధించేవాడు) అని అర్థం.

ఈ టైటిల్, సినిమాలో చైతన్య పాత్ర స్వభావానికి సరిగ్గా సరిపోయేలా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ చిత్రం మైథలాజికల్ థ్రిల్లర్ (Mythological Thriller) జానర్‌లో రూపొందుతోంది. గతంలో ‘విరూపాక్ష’తో దర్శకుడు కార్తీక్ దండు సృష్టించిన మిస్టికల్ థ్రిల్లర్ తరహాలోనే, ఈ సినిమాలో కూడా అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరిత కథనం ఉండబోతోందని సమాచారం.

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉంది. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Karthik Dandu latest news Naga Chaitanya birthday NC24 title Telugu News Vrushakarma movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.