నటి కృతి సనన్ (Kriti Sanon) మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన కృతి, తెలుగు ప్రేక్షకులకు ‘1: నేనొక్కడినే’ సినిమాతో పరిచయమైంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన నటించి అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చవి చూసింది.ఇక ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘హీరోపంతి’, ‘మిమీ’ వంటి హిట్స్‌తో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరింది. మిమీ చిత్రంలో సరోగేట్ మదర్ పాత్రకు ఆమె జాతీయ అవార్డు వచ్చింది..
Read Also: Jio Hotstar: ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన జియో హాట్‌స్టార్
ఒక ఇంటర్వ్యూలో కృతి చేసిన కామెంట్స్
కోలీవుడ్ హీరో ధనుష్, కృతి సనన్ (Kriti Sanon) జంటగా తెరకెక్కిన ‘తేరే ఇష్క్ మే’ ఇటీవల ప్రేక్షకలు ముందుకొచ్చి ఫర్వాలేదనిపించింది. ఆ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఆమె హైట్ గురించి ప్రశ్నించారు.
ఇండస్ట్రీలో పొడుగ్గా ఉండే హీరోయిన్లు తక్కువగా ఉంటారని, మీరు చాలా ఎత్తుగా ఉంటారని, మీతో నటించిన హీరోల్లో చాలామంది మీకన్నా పొట్టిగా ఉంటారని యాంకర్ ప్రస్తావించగా, కృతి నవ్వుతూ సమాధానం ఇచ్చింది. “అవును, నేను కొంచెం హైట్ ఉంటాను. నేను చేసిన హీరోలలో చాలామంది నాకన్నా హైట్ తక్కువ. ప్రభాస్, అర్జున్ కపూర్ లాంటి వారు మాత్రం నాకన్నా ఎత్తుగా ఉంటారు” అని ఆమె చెప్పుకొచ్చింది.
మహేష్ బాబు పేరు ప్రస్తావించకపోవడం
అయితే ఈ కామెంట్స్‌లో మహేష్ బాబు పేరు ప్రస్తావించకపోవడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. బాలీవుడ్‌లో స్థిరపడకముందే కృతి, మహేష్ బాబు సరసన నటించిందని, ఆమె కెరీర్‌కు అది ముఖ్యమైన తొలి అడుగని గుర్తు చేస్తూ మహేష్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
“మొదటి సినిమా హీరోని మర్చిపోవడం అంటే అవమానించడమే” అంటూ సోషల్ మీడియాలో కృతిని ట్రోల్ చేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ చేసిన పోస్టులు, కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారం సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా, ఇప్పటికైనా కృతి సనన్ ఈ ట్రోలింగ్‌పై స్పందిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: