📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Mahesh Rajamouli Movie: మహేశ్ బాబు బర్త్‌డే..SSMB29 నుండి బిగ్ అప్‌డేట్

Author Icon By Anusha
Updated: August 9, 2025 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేష‌న్‌లో రానున్న భారీ చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ29’ (వ‌ర్కింగ్ టైటిల్) గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా శనివారం రాజమౌళి ఒక కీలక ప్రకటన చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు.ఈ విషయంపై తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా రాజమౌళి ఒక సందేశాన్ని పంచుకున్నారు. “ఈ సినిమా కథ, దాని పరిధి చాలా విస్తృతమైనవి. కేవలం ఫొటోలు లేదా ప్రెస్ కాన్ఫరెన్స్‌లతో దానికి న్యాయం చేయలేం. అందుకే మేము ఈ సినిమా సారాంశాన్ని, లోతును, మేం సృష్టిస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించేందుకు ప్రత్యేకంగా ఒక ప్రదర్శనను సిద్ధం చేస్తున్నాం. ఇది ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది. మీ ఓపికకు ధన్యవాదాలు” అని జ‌క్క‌న్న రాసుకొచ్చారు.

మెడలో త్రిశూలం- నంది

మహేష్ ఫ్యాన్స్ కోసం రాజమౌళి ఓ పోస్ట్ పెట్టారు. మహేశ్ ప్రీలుక్‌ ఫొటోలా ఇది ఉంది. రాజమౌళి పెట్టిన లుక్‌లో హీరో మెడలో మూడు నామాలు, త్రిశూలం, ఢమరుకం, నంది బొమ్మలు ఉన్న మాల ఉంది. అయితే దీని పూర్తి లుక్‌ను నవంబర్‌లో రివీల్‌ చేస్తామని అప్పటివరకూ వెయిట్ చేయాలి అంటూ చెప్పుకొచ్చారు.ఈ సినిమా షూటింగ్‌ని మేము ఇటీవలే ప్రారంభించాం. దీని గురించి మీరంతా చూపిస్తే ఇంట్రెస్ట్ మాకు కూడా ఆనందం కలిగిస్తుంది. ఈ సినిమా చాలా భారీస్థాయిలో ఉండబోతుంది. కేవలం ప్రెస్‌మీట్‌ పెట్టి లేదా కొన్ని ఇమేజ్‌లు విడుదల చేయడం వల్ల స్టోరీకి పూర్తిస్థాయిలో మేము న్యాయం చేయలేం. దీన్ని భారీఎత్తున రూపొందిస్తున్నాం అన్నది మాత్రం చెప్పగలను. నవంబర్‌ 2025లో మహేశ్‌ లుక్‌ను విడుదల చేస్తాం. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా మాత్రం ఇది ఉంటుంది. మీరంతా సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అంటూ రాజమౌళి (Rajamouli) పోస్ట్ పెట్టారు.

https://twitter.com/ssrajamouli/status/1954055214237106276?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1954055214237106276%7Ctwgr%5Ea643a384ab893a6b36b7f8d538c29be5adbb2080%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fmahesh-rajamouli-movie-ssmb29-update-hero-pre-look-released-with-hashtag-globetrotter%2Farticleshow%2F123201515.cms

ఫ్యాన్స్‌కి సెలబ్రెటీలకి మహేష్ థాంక్స్ చెప్పారు

ఈ పోస్ట్‌కు #GlobeTrotter అనే హ్యాష్ ట్యాగ్‌ని రాజమౌళి జోడించారు. దీని అర్థం ఇందులో హీరో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే ఒక ట్రావెలర్ అని పరోక్షంగా జక్కన్న చెప్పినట్లు అనిపిస్తుంది. ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ పోస్టుపై నిరాశగా ఉన్నారు. కనీసం మహేష్ ఫస్ట్ లుక్ అయినా వస్తుందని అనుకున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కి సెలబ్రెటీలకి మహేష్ థాంక్స్ చెప్పారు. “#SSMB29 అప్‌డేట్‌ కావాలని అందరూ అడుగుతున్నారు.. రాజమౌళి సినిమాలో నా లుక్‌ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నా. మీలాగే నేను కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా.. నవంబర్‌లో మీతో పాటు నేను కూడా ఎంజాయ్‌ చేస్తా” అంటూ పోస్ట్‌ పెట్టారు మహేష్. ఈ పోస్ట్ కింద కూడా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు.

మహేశ్ బాబు జన్మదినం ఎప్పుడు?

మహేశ్ బాబు ఆగస్టు 9, 1975న జన్మించారు.

మహేశ్ బాబు మొదటి సినిమా ఏది?

హీరోగా “రాజకుమారుడు” (1999) ఆయన తొలి సినిమా.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sex-toy-gift-for-daughter/cinema/actress/528069/

Birthday Announcement Cinema BuzzBreaking News Film News latest news Mahesh Babu Movie Updates SS Rajamouli SSMB29 Telugu cinema Telugu Films Telugu News Breaking News tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.