Mahesh Babu: రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్

Read Time:  1 min
Mahesh Babu: రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్
FONT SIZE
GET APP

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’, ఈ చిత్రంలో రాముడి పాత్ర తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని మహేశ్ బాబు (Mahesh Babu) అన్నారు. ‘దేవుడి పాత్రలో గాంభీర్యం కోసం మోడ్రన్ బాడీ లాంగ్వేజ్‌ను మర్చిపోవాల్సి వచ్చింది. దీనికోసం 3నెలల పాటు ‘కలరిపయట్టు’లో శిక్షణ తీసుకున్నాను. నిలబడే తీరు, నడక మార్చుకోవడానికీ ఇది హెల్ప్ అయ్యింది. రన్నింగ్ స్టైల్ ఛేంజ్ చేయడానికీ ప్రాక్టీస్ చేశాను’ అని Varietyకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ తెలిపారు.

Read Also: Ranveer Singh: ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్‌పై కేసు నమోదు!

Mahesh Babu: The role of Ram is the biggest challenge in my career
Mahesh Babu: The role of Ram is the biggest challenge in my career

ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల

ఈ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో సుమారు 25 నిమిషాల పాటు సాగే పురాణ గాథల సీక్వెన్స్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.. పూర్తిస్థాయి IMAX ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించబోతున్న ఈ విజువల్ వండర్, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.