📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Mahesh Babu: పాస్‌లు ఉన్నవారికే ఈవెంట్‌కు అనుమతి: మహేశ్

Author Icon By Aanusha
Updated: November 15, 2025 • 10:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహేష్ బాబు- రాజమౌళి భారీ యాక్షన్ సినిమా ‘గ్లోబ్ ట్రాటర్’ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ లాంటి పాస్‌లు తయారు చేయడం హైలైట్‌గా మారింది. ఈవెంట్‌పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.మహేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా ఇది నిలవనుందని అందరూ భావిస్తున్నారు.

Read Also: Akhanda 2: ‘అఖండ 2’ నుంచి తాండవం సాంగ్ విడుదల

ఈ సినిమా నుంచి పెద్ద అప్‌డేట్స్‌ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) లో జరుగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల కానున్నాయి. ఆ ఈవెంట్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ పెరిగిపోయింది. పాసుల కోసం ఫ్యాన్స్ తెగ ట్రై చేస్తున్నారు. ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానుల కోసం టీమ్ ప్రత్యేకంగా పాస్‌పోర్ట్‌లా కనిపించే పాస్‌లను తయారు చేసింది.

పసుపు రంగు అట్టతో రూపొందించిన ఈ పాస్‌లు అచ్చం అసలైన పాస్‌పోర్ట్‌లా కనిపిస్తున్నాయి. పాస్ ముందుభాగంపై “GLOBETROTTER EVENT”, “PASSPORT” అని ప్రత్యేకంగా ముద్రించారు. లోపల మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి ఫోటోలు ఉన్నాయి. ఈవెంట్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్, ప్రవేశ మార్గాలు, మ్యాప్ వంటి వివరాలు కూడా జత చేశారు.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

కంగారు పడి వచ్చేయకండి

ఈ నేపథ్యంలో మహేశ్ బాబు (Mahesh Babu) తన అభిమానులను ఉద్దేశించి ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానులు తప్పనిసరిగా పాస్‌లు కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారని, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిబంధన పాటించాలని కోరారు.

పాస్‌లు లేకుండా ఎవరూ రావొద్దని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీడియోలో మహేశ్ బాబు (Mahesh Babu) సరదాగా మాట్లాడుతూ, “పాస్‌పోర్ట్ (ఈవెంట్ పాస్) లేకుండా కంగారు పడి వచ్చేయకండి” అంటూ అభిమానులకు సూచించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Globetrotter Movie latest news Mahesh Babu Rajamouli Combo Ramoji Film City Event SSMB29 Title Reveal Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.