సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకీ రెట్టింపవుతున్నాయి.ఇప్పటికే రిలీజైన ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో, మహేష్ ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన లభించింది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వినిపించినా, క్షణాల్లోనే వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ అత్యంత భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్నారు.
Read Also: Movie: రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?
ఇది తెలుగులో మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కానుంది. మూవీ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీలలో పెద్ద పెద్ద సెట్స్ నిర్మించారు. కోకాపేటలో భారీ ఖర్చుతో వారణాసి సెట్ రూపొందించారు. ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే సెట్ లో ఓ భారీ యాక్షన్ సీన్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు (Mahesh Babu)పాల్గొనే ఈ హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్.. సినిమాలోని హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందట.
హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్
గత కొన్ని రోజులుగా కోకాపేట వారణాసి సెట్‌లో మహేష్ బాబు పాల్గొనే ఓ భారీ యాక్షన్ సీన్ షూటింగ్ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇది సినిమాలో హైలైట్‌గా నిలిచే హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ అని చెబుతున్నారు. అంతేకాదు, ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ ప్రత్యేక సెట్లో ఇంటర్వెల్ బ్లాక్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో మహేష్ బాబు క్లీన్ షేవ్డ్ లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.
రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు అంటే కేవలం ఫైట్లు మాత్రమే కాకుండా, ఎమోషన్, కథా బలం కలగలిపి ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా డిజైన్ చేస్తారని తెలిసిందే. ‘వారణాసి’లో కూడా ఇలాంటి పవర్‌ఫుల్ యాక్షన్ బ్లాక్స్ ఎన్నో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబును రాజమౌళి ఇప్పటివరకు చూడని విధంగా ఇంటెన్స్ యాక్షన్ మోడ్‌లో ప్రజెంట్ చేయనున్నారని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: