హిందూ పురాణాల కథాంశంపై ఆధారపడి రూపొందిన యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రం కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లైన హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. జూలై 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యానిమేటెడ్ మూవీ (Animated movie) ప్రేక్షకుల నుంచి, సమీక్షకుల నుంచి ప్రశంసలు పొందింది. విడుదలైన వెంటనే ప్రేక్షకుల ప్రీతిని పొందడం, థియేటర్లలో భారీగా టిక్కెట్ అమ్మకాలు జరగడం, సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు వసూళ్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 19 నుంచి పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనూ తన దూకుడు ప్రదర్శిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇండియాలో టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. ముందుగా అంతా ఊహించినట్టుగానే అద్బుతమైన వ్యూయర్‌షిప్‌తో డిజిటల్ ప్లాట్‌ఫాంలో కూడా దండయాత్ర కొనసాగిస్తోంది.
దశావతారాలను ఆధారంగా చేసుకుని ఏడు భాగాలుగా
అశ్విన్ కుమార్ స్టోరీ టెల్లింగ్, సాలిడ్ విజువల్స్‌కు కుటుంబ ప్రేక్షకులు, చిన్నారులు ఫిదా అయిపోతున్నారు.హిందూ పురాణాలలోని శ్రీమహావిష్ణువు (Lord Vishnu) దశావతారాలను ఆధారంగా చేసుకుని ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో ఫస్ట్ పార్టుగా వచ్చింది మహావతార్ నరసింహ. ఈ ప్రాంచైజీలో రాబోయే నెక్ట్స్ పార్టులపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: