📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News: Sivakarthikeyan: ‘మదరాసి’ ఓటీటీ విడుదల

Author Icon By Pooja
Updated: September 30, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ మధ్యకాలంలో విభిన్నమైన టైటిల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రాలలో ‘మదరాసి’ ఒకటి. శివకార్తికేయన్ మరియు రుక్మిణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై లక్ష్మీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో(Theaters) విడుదలైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్, తమిళనాడులో పర్వాలేదనిపించింది.

Read Also: Sajjanar: డ్రగ్స్‌పై ఉక్కుపాదమే అంటున్న సజ్జనార్

ఈ భారీ బడ్జెట్ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘మదరాసి’ సినిమా అక్టోబర్ 1వ తేదీ నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ఒక కీలకమైన పాత్రను పోషించారు.

అక్రమ ఆయుధాల రవాణా చుట్టూ తిరిగే ఈ సినిమా కథాంశం ఆసక్తికరంగా ఉంటుంది. ఉత్తర భారతం నుంచి తమిళనాడుకు తరలిస్తున్న ఆయుధాలకు సంబంధించిన సిండికేట్‌ను(Syndicate) అడ్డుకోవడమే ప్రధాన కథ. ఈ క్రమంలో ఆ సిండికేట్ హీరో, హీరోయిన్‌లను ఎలా లక్ష్యం చేసింది, వారిద్దరూ ఆ ముప్పు నుంచి ఎలా బయటపడ్డారు అనేదే ఈ కథలోని ముఖ్య అంశాలు. థియేటర్లలో ఫరవాలేదనిపించుకున్న ఈ సినిమా, ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.

ఈ సినిమాలో ప్రధాన నటీనటులు ఎవరు?

శివకార్తికేయన్, రుక్మిణి ప్రధాన పాత్రలు పోషించగా, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమా కథాంశం ఏమిటి?

ఉత్తర భారతం నుంచి తమిళనాడుకు తరలిస్తున్న అక్రమ ఆయుధాల రవాణాకు సంబంధించిన సిండికేట్‌ను అడ్డుకోవడమే ఈ సినిమా ప్రధాన కథాంశం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telangana/sajjanar-sajjanar-says-he-has-an-iron-fist-on-drugs/557277/

Amazon Prime Video AR Murugadoss Illegal Arms Trafficking Latest News in Telugu Madarasi OTT Release Sivakarthikeyan Movie Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.