📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Made in Korea Review: ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

Author Icon By Anusha
Updated: March 13, 2026 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Made in Korea Review: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకుల్లో కొరియన్ డ్రామాలు, సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు కార్తీక్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘మేడ్ ఇన్ కొరియా’. కుందనపు బొమ్మలాంటి అందంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో నాయికా ప్రధాన పాత్రలో నటించారు. నిన్నటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఈ సినిమా తెలుగు వెర్షన్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: Border 2 OTT release: రిలీజ్ డేట్ ఖరారు..నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

కథ

తమిళనాడులోని ఒక మారుమూల కొండ ప్రాంతానికి చెందిన యువతి శెన్బా (ప్రియాంక అరుళ్ మోహన్). సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా అందని ఆ పల్లెటూర్ లో, ఆమె తండ్రి ఒక చిన్న హోటల్ నడుపుతుంటాడు. చిన్నతనంలో స్కూల్ వార్షికోత్సవంలో కన్యాకుమారి నుంచి కొరియా వెళ్లిన ఒక రాణి పాత్రను శెన్బా పోషిస్తుంది. ఆ పాత్ర ఆమె మనసుపై బలమైన ముద్ర వేస్తుంది. అప్పటి నుండి ఎలాగైనా ‘కొరియా’ను చూడాలనే కోరిక ఆమెలో బలంగా నాటుకుపోతుంది. వయసుతో పాటు పెరిగిన ఆ ఆశయం ఆమెను ఎలాంటి మలుపులు తిప్పింది అనేదే ఈ సినిమా ముఖ్య ఇతివృత్తం.

Made in Korea Review

కథనం

కొండ ప్రాంతంలోని ఒక చిన్న విలేజ్.. పుట్టి పెరిగిన ఊరు తప్ప బయట ప్రపంచంలోకి అడుగుపెట్టని అమ్మాయి .. తల్లిదండ్రులకు ఎప్పుడూ దూరంగా వెళ్లని అమ్మాయి. అలాంటి శెన్బా, స్కూల్ డేస్ నుంచి ప్రేమిస్తూ వచ్చిన ‘మణి’ని నమ్మేసి ఇల్లొదిలి వెళ్లిపోతుంది. డబ్బు కోసం అతను మోసం చేశాడని గ్రహించిన ఆమె, ఎవరూ తెలియని ఆ దేశంలో ఎలాంటి రోజులను గడిపిందనే విషయం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు.

జీవితంలో చాలామందికి ఏదైనా ఒక దేశం పట్లనో .. ప్రాంతం పట్లనో ఒక రకమైన ఇష్టం ఏర్పడుతుంది. తప్పకుండా అక్కడికి వెళ్లాలనే ఒక బలమైన కోరిక వాళ్లను వెంటాడుతూ ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఆనందంతో కాకుండా ఆవేదనతో అడుగుపెట్టవలసి వస్తే, సంతోషంతో కాకుండా సమస్యలతో వెళ్లవలసి వస్తే ఎలా ఉంటుందనేది ఒక ప్రయాణంగా ఈ కథను నడిపిస్తూ వెళ్లారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Korean Based Indian Movies Made in Korea Review Netflix Priyanka Arul Mohan Latest Movie OTT

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.