📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Maa Inti Bangaram Release: ‘మా ఇంటి బంగారం’ విడుదల తేదీ ఫిక్స్

Author Icon By Anusha
Updated: February 22, 2026 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Maa Inti Bangaram Release: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వేసవిలో సమంత తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు.

Read Also: Taapsee Pannu: సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్

ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్.. తలుపు చాటున ‘బంగారం’

కొత్త పోస్టర్‌లో సమంత ఓ తలుపు చాటు నుంచి ఆసక్తిగా తొంగిచూస్తూ కనిపించారు. ఈ పోస్టర్‌ను పంచుకుంటూ, “ఈ వేసవిలో థియేటర్లలో కలుద్దాం, బంగారాలు.. మే 15న ‘మా ఇంటి బంగారం’ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది” అని ఆమె క్యాప్షన్ జోడించారు.నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను జనవరిలో విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. బస్సులో బ్రౌన్ కలర్ చీరలో నిలబడి, పోరాటానికి సిద్ధమైనట్లుగా ఉన్న సమంత లుక్ సినిమాపై అంచనాలను పెంచింది.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఈ సినిమా గురించి సమంత మాట్లాడుతూ, “ఇది కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే ఎమోషనల్ కథ. ఒక మహిళ బలం ఆమె ధైర్యం నుంచే కాదు, బలహీనత నుంచి కూడా వస్తుందని ఈ చిత్రం చెబుతుంది. ఈ పాత్రలో నటించడం, నిర్మాతగా ఈ సినిమాను నిర్మించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది” అని తెలిపారు. సరదాగా, ఉత్కంఠగా సాగే ఈ కథ ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.కాగా, సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై భర్త రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Maa Inti Bangaram Poster Maa Inti Bangaram Release Samantha New Telugu Movie Summer Releases 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.