M Arjuna Raju: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వర్ణయుగపు నిర్మాతల్లో ఒకరిగా వెలుగొందిన ఎం. అర్జునరాజు (87) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: RGV-Aditya Dhar: “ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ
నిబద్ధతతో సినిమాలు నిర్మించిన నిర్మాతగా అర్జునరాజుకు ప్రత్యేక గుర్తింపు ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
నందమూరి తారక రామారావు కథానాయకుడిగా తెరకెక్కిన ‘వేటగాడు’ చిత్రంతో నిర్మాతగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించి అర్జునరాజుకు నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే చిత్రాన్ని హిందీలో ‘నిషానా’ పేరుతో రీమేక్ చేయడం కూడా విశేషం. ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనే ‘కొండవీటి సింహం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు.

ఆయన మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి తీవ్ర సంతాపం ప్రకటించాయి
ఎన్టీఆర్‌తో పాటు కృష్ణ, కృష్ణంరాజులతో ‘అడవి సింహాలు’, శోభన్‌బాబుతో ‘కోడెత్రాచు’, చిరంజీవితో ‘జేబుదొంగ’, నాగార్జునతో ‘బావనచ్చాడు’ వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. శ్రీకాంత్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘మా నాన్నకు పెళ్లి’ చిత్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుకున్న తొలి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది.
తెలుగులోనే కాకుండా హిందీలోనూ జితేంద్ర, ధర్మేంద్ర వంటి స్టార్లతో ఆరు చిత్రాలు నిర్మించి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు.అర్జునరాజు అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఆయన మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి తీవ్ర సంతాపం ప్రకటించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: